Telanganapatrika (July 31): లేడీ కండక్టర్, కామారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన లేడీ కండక్టర్ సువర్ణ తన నిజాయితీని చాటుకున్నారు. బస్సులో మరిచిపోయిన బ్యాగును తిరిగి ప్రయాణికురాలకు అప్పగించారు .ఇట్టి ఘటన బుధవారం చోటుచేసుకుంది.

TSRTC గర్వపడే లేడీ కండక్టర్..
కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జేబీఎస్ వరకు వెళ్ళింది .అందులో ఎక్కిన ఒక ప్రయాణికురాలు తన బ్యాగును బస్సులో మరిచి జేబిఎస్ లో దిగిపోయారు .బస్సులో ఉన్న బ్యాగును గమనించిన కండక్టర్ సువర్ణ దానిని తీసుకొని తన దగ్గర ఉంచుకున్నారు. బస్సు దిగిపోయినా ప్రయాణికురాలు తన వద్ద బ్యాగు లేదని కనుగుతినిపోయి తిరిగి బస్ స్టాప్ వద్దకు చేరుకున్నారు .అక్కడ ఉన్న కండక్టర్ ను సంప్రదించగా బ్యాగు తన వద్ద ఉందని చెప్పారు. బ్యాగులో నాలుగు తులాల బంగారం ,సెల్ ఫోన్ తో పాటు నగదు ఉండగా వాటిని ప్రయాణికురాలకు కండక్టర్ సువర్ణ అప్పగించారు. నిజాయితీ చాటుకున్న కండక్టర్ సువర్ణను పలువురు ప్రయాణికులు అభినందించి అక్కడ ఆమెకు మిఠాయిలు తినిపించారు.
Read More: Read Today’s E-paper News in Telugu


Comments are closed.