Advertisement

Government School Success Story: కొడిమ్యాల ZPHSలో పదవ తరగతి లో 100 % ఉత్తీర్ణత

TELANGANA PATRIKA(MAY 5) , Government School Success Story: చదువు ఒక్కటే తలరాత మార్చగలదు. జ్ఞానం మార్గమే జీవిత మార్పుకు నాంది అన్నదానికి నిదర్శనంగా, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) 2024-25 విద్యా సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో 100% పాస్ రిజల్ట్ సాధించింది.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

ప్రతిభ గల విద్యార్థులకు ఘన సన్మానం:

ఈ ఘనతను పురస్కరించుకుని సోమవారం జరిగిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఏ. విజయేందిర ఆధ్వర్యంలో పాఠశాలలో విద్యార్థులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. భోగ రాకేష్ గారు (BJP యువనాయకుడు) ప్రత్యేక అతిథిగా హాజరై, 500కి పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు పట్ల తన అభినందనలు తెలియజేశారు

Advertisement

ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు:

  • నాంపల్లి సుష్మ శ్రీ – 571 మార్కులు
  • జల్ద అక్షర – 547 మార్కులు

ఈ సందర్భంగా భోగ రాకేష్ మాట్లాడుతూ:

“ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇలా ప్రతిభ కనబరిచినప్పుడు సమాజం దృష్టికీ మార్పు వస్తుంది. ప్రైవేట్ పాఠశాలలకు సమానంగా ప్రభుత్వ బడుల్లోనూ ఉన్నత విద్య ఉంటుంది.”

ప్రధానోపాధ్యాయురాలు సందేశం:

ఏ. విజయేందిరి మాట్లాడుతూ….”ఈ విజయాల వెనుక టీచర్ల కృషి ఉంది. మా టీచింగ్ స్టాఫ్‌కు, అలాగే సహకరించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు. విద్యార్థులు ఇంకా ఎన్నో విజయాలను సాధించాలని ఆశిస్తున్నాం.”

కార్యక్రమానికి హాజరైన ముఖ్యులు:

  1. నాంపల్లి మల్లేశం (మాజీ హెచ్‌ఎమ్‌)
  2. నాగేల్లి నరసయ్య (మాజీ ఉపసర్పంచ్)
  3. పూర్వ విద్యార్థులు చేన్న దేవేందర్, కట్టెకోల రాజు, జల్ద సుధాకర్
  4. ఉపాధ్యాయులు: హైమదుల్లా ఖాన్, సంపత్ కుమార్, లక్ష్మీరాజం (స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్)

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →