Godavari Water Project: హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరా పెంచేందుకు హైడ్రాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) త్వరలో గోదావరి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ దశలు 2 మరియు 3 పనులను ప్రారంభించనుంది. ఈ దశల్లో మొత్తం 300 మిలియన్ గ్యాలన్లు (MGD) నీటిని నగరానికి అందించే ప్రణాళిక రూపొందించబడింది.

ప్రాజెక్ట్‌లో భాగంగా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి ఘన్పూర్ వరకు 3,000 మిల్లీమీటర్ల వ్యాసంలో పైప్‌లైన్ వేసే పనులు, కొత్త వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, పంప్‌హౌసులు మరియు సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.
Godavari Water Project కొత్త దశలకు గ్రీన్ సిగ్నల్
ప్రస్తుతం గోదావరి ప్రాజెక్ట్ తొలి దశ ద్వారా యెల్లంపల్లి నుంచి 10 TMC నీటిని నగరానికి సరఫరా చేస్తున్నారు. రెండో, మూడో దశల్లో అదనంగా 20 TMC నీటిని మల్లన్నసాగర్ నుంచి తీసుకురావాలని ప్రణాళిక. అందులో 17.5 TMC నీరు తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు, మిగిలిన 2.5 TMC నీటిని ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల పునరుజ్జీవనానికి వినియోగించనున్నారు.
ఘన్పూర్, షామీర్పేట్ ప్రాంతాల్లో 1,170 MLD సామర్థ్యంతో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు నిర్మించనున్నారు. మొత్తం ప్రాజెక్ట్ పనులు రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలన్నది లక్ష్యం.
Read More: Read Today’s E-paper News in Telugu
