
TELANGANA PATRIKA(MAY25) , Food Safety: ఆదిలాబాద్ జిల్లా సొనాల మండల కేంద్రంలోని ఓ దాబాలో భోజనం చేసే సమయంలో బొద్దింక కనిపించడం స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ఫిర్యాదు చెయ్యగా, దీనిపై అధికారులు స్పందించారు.
హోటల్ పై Food Safety అధికారుల తనిఖీ
ఆదివారం నాడు ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్‌ను తనిఖీ చేశారు. హోటల్‌లో ఫుడ్ సేఫ్టీ, జీఎస్టీ, గ్రామ పంచాయతీ లైసెన్సులు లేకుండానే నిర్వహణ జరుగుతోందని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీధర్ వెల్లడించారు.
నోటీసులు జారీ – చర్యల హెచ్చరిక
ఫుడ్ సేఫ్టీ చట్టం ప్రకారం హోటల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. వారం రోజుల్లో స్పందన రాకపోతే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలకు సూచన:
పౌష్టిక భోజనంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు తప్పనిసరి. ప్రజలు ఎక్కడైనా మలిన ఆహారం లేదా ఆరోగ్యానికి హానికరమైన పరిస్థితులు ఉంటే, వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.
Also Read : Food Safety Task Force Raids: బెల్ స్వీట్స్ కారా తయారీ కేంద్రంపై ఆకస్మిక దాడులు