Flexi Ban in Public Places: ఆదిలాబాద్ పట్టణంలో నూతన నిబంధనలు అమలు

Follow us

TELANGANA PATRIKA(MAY 8) , Flexi Ban in Public Places: ఆదిలాబాద్, పబ్లిక్ ప్రదేశాల్లో అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఫ్లెక్సీలు వేసే ముందు మున్సిపాలిటీ శాఖ అనుమతి తీసుకోవాలి, లేకపోతే క్రిమినల్ కేసులు నమోదవుతాయని ఆయన హెచ్చరించారు.

Flexi Ban in Public Places చట్ట విరుద్ధంగా ఫ్లెక్సీలు పెడితే ఏం జరుగుతుంది?

Telangana Prevention of Disfigurement Act, 1997 ప్రకారం, నిబంధనలు ఉల్లంఘిస్తే:

Advertisement
  • ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష
  • రూ. 5000 వరకు జరిమానా
  • జైలు + జరిమానా రెండూ విధించే అవకాశం
డీఎస్పీ వివరించినట్లుగా:
  1. ఫ్లెక్సీలు పెట్టే ముందు స్థలం, సమయం, రుసుము వివరాలతో మున్సిపాలిటీలో అనుమతి తీసుకోవాలి
  2. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పోలీసులు, మున్సిపల్ అధికారులు తొలగించే హక్కు ఉంది
  3. ఫ్లాస్టిక్ ఫ్లెక్సీల ఏర్పాటుకు కూడా నిషేధం ఉంది

ఫ్లెక్సీల వల్ల ప్రమాదాలు

జన్మదిన వేడుకల పేరిట పెట్టే ఫ్లెక్సీలు ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడంతో పాటు ప్రమాదాలకు దారితీస్తున్నాయని డీఎస్పీ తెలిపారు. ఒకరి పుట్టినరోజు, మరొకరికి విషాదంగా మారకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజు మాట్లాడుతూ, ప్రజలందరూ చట్టాన్ని గౌరవించి అనుమతి లేకుండా ఫ్లెక్సీలు పెట్టకుండా ఉండాలని సూచించారు. ఈ పత్రికా సమావేశంలో వన్ టౌన్ సీఐ బి. సునీల్ కుమార్ పాల్గొన్నారు.

Also Read: AP POLYCET Results 2025: మే 10న ఫలితాలు విడుదల, హాజరు శాతం 89%!

ఈ వార్తను షేర్ చేయండి!

మీ స్నేహితులకు, బంధువులకు పంపండి 👇

వాట్సాప్‌లో షేర్ చేయండి
Advertisement

About Telangana Patrika Team

The Telangana Patrika Team leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, public issues, and trending schemes, the team ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, the Telangana Patrika Team blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Telangana Patrika Team →

Comments are closed.