CM Revanth Reddy- Rice Distribution: రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి, రేపు ప్రారంభించనున్నారు.
రేపు సాయంత్రం 5 గంట లకు బేగంపేట విమానాశ్ర యం నుంచిసీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిలు హెలికాప్టర్ లో బయలుదేరి సాయంత్రం 5.45 గంటలకు హుజూర్ నగర్‌లోని రామస్వామి గట్టు వద్ద హెలీప్యాడ్‌లో దిగుతారు. మొత్తానికి అక్కడున్న ప్రాంతం లో 2160 గల మోడల్ కాలనీ ఇన్లను పరిలిశిస్తారని సమాచారం. అక్కడినుంచి రోడ్డు మార్గంలో పట్టణంలోని ఫణిగిరి గట్టుకు వెళ్లే దారిలోని రాజీవ్ ప్రాంగణానికి 6.15 గంటలకు చేరుకుంటారు. ఉగాది పర్వదినం సందర్భంగా బహిరంగ సభలోనే సన్న బియ్యం పంపిణీ పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారు. 6.15 గంటల నుంచి 7.30 గంటల వరకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 7.30 గంటలకు హుజూర్‌నగర్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 9.45 గంటలకు హైదరాబాద్‌కు వెళతారు. ఈ సభలో మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.
నేడు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించనున్న CM Revanth Reddy
Join WhatsApp Group
Join Now