Telanganapatrika (July 31): ఫీల్డ్ అసిస్టెంట్ల కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలపనుంది. గతంలో తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు కసరత్తులు చేస్తోంది. ఫీల్డ్ అసిస్టెంట్స్ ను తొలగించిన సర్క్యులర్ ను రద్దు చేస్తూ, వారిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.

ఆగిన ఆశలకు ఊపిరి – ఫీల్డ్ అసిస్టెంట్లు విధుల్లోకి తిరిగి ..
నేడు ఫీల్డ్ అసిస్టెంట్స్ అసోసియేషన్ నేతలతో సమావేశం జరిపిన మంత్రి సీతక్క పలు కీలక అంశాలను చర్చించారు. ప్రస్తుతం ఎఫ్ఏలకు ఇచ్చే జీతాల్లో తేడాలున్నాయని, వాటిని సవరిస్తామని హామీ ఇచ్చారు.
అలాగే ఎఫ్ఏల బదిలీలపై కూడా సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లకుఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి హెల్త్ ఇన్సూరెన్స్, వ్యక్తిగత, గ్రూప్ ఇన్సూరెన్స్ లు ఇచ్చేలా చర్యలు చేపడతామని మంత్రి సీతక్క తెలియజేశారు. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇన్నాళ్ళుగా తమను విధుల్లోకి తిరిగి తీసుకోవాలని ఎదురు చూస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు హర్షం వ్యక్తం చేస్తూ.. సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.
Read More: Read Today’s E-paper News in Telugu