Telanganapatrika (July 15): Farmers Emotional Gesture , రాజకీయ నాయకుల పై అభిమానాన్ని చాటుకోవడం సహజం. కొందరు తమ అభిమానాన్ని వినూత్న రీతిలో ప్రదర్శిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మగ్దుంపూర్ గ్రామానికి చెందిన రైతు చిట్యాల సురేశ్ మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు, నంగునూరు మండలం మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డిపై తనకున్న అభిమానాన్ని చాటేందుకు వినూత్న పద్ధతి ఎంచుకున్నాడు.

Farmers Emotional Gesture నారు కాదు… ఆశల మొలక..!
ఆ రైతు తన వరి పొలంలో వరి నాట్లు వేసే పద్ధతిలో ఒక మడిలో “టీహెచ్ఆర్” “జేఎస్ఆర్” ఆంగ్ల అక్షరాలతో నాట్లు వేయడం విశేషంగా మారింది. సాధారణంగా ఫ్లెక్సీలు బ్యానర్లు కటౌట్లు పెట్టి అభిమాని చాటుకుంటారు. ఈ రైతు ప్రకృతిని వ్యవసాయాన్ని వేదికగా చేసుకుని తన అభిమానం వ్యక్తం చేయడం ఆకట్టుకుంటోంది.
సాగునీటి ప్రాజెక్టు అయిన కాళేశ్వరం నిర్మించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు ఎంతో కష్టపడ్డారని సురేశ్ ఈ సందర్భంగా తెలిపారు. రంగనాయక సాగర్ ద్వారా తమ గ్రామాలకు గోదావరి జలాలు వచ్చి చెరువుల కుంటలు నిండాయని చెప్పారు. ఆ నీటితో వ్యవసాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. గోదావరి జలాల ద్వారా సాగు నీరు అందిన ఆనందంలో తన అభిమానాన్ని చాటుకున్నానని రైతు చిట్యాల సురేశ్ తెలిపాడు.
Read More: Read Today’s E-paper News in Telugu