Eid Traffic Advisory Hyderabad: హైదరాబాద్ నగరంలో Eid-ul-Fitr సందర్భంగా భారీగా ప్రార్థనలు జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక అలర్ట్ జారీ చేశారు. మార్చి 21 మరియు 22 తేదీల్లో ఉదయం 7 గంటల నుంచి 11:30 వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Eid Traffic Advisory Hyderabad ప్రధానంగా Mir Alam Tank Eidgah (జూ పార్క్ సమీపంలో) మరియు Masab Tank Hockey Ground వద్ద పెద్ద సంఖ్యలో ప్రార్థనలు జరుగనున్నాయి. ఈ కారణంగా ఆ ప్రాంతాల్లో భారీగా వాహనాల రాకపోకలు ఉంటాయి.
ట్రాఫిక్ పోలీసులు తెలిపిన ప్రకారం బహదుర్పురా, కలపతర్, నవాబ్ సాహెబ్ కుంటా, పురానాపూల్, శాస్త్రిపురం, దానమ్మ హట్స్, మసాబ్ ట్యాంక్, NMDC, ఖాజా మాన్షన్, 1/12 జంక్షన్, PTI జంక్షన్ వంటి ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని, వీలైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని పోలీసులు సూచించారు. అలాగే ట్రాఫిక్ అప్‌డేట్స్ కోసం అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఫాలో అవ్వాలని కోరారు.
అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 కు కాల్ చేసి సహాయం పొందవచ్చు. ఈద్ రోజుల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించుకోవాలంటే ముందస్తు ప్రణాళిక చాలా ముఖ్యం.
Read More: Read Today’s E-paper News in Telugu
