Drones Security In Jubilee Hills: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో పారదర్శకత, భద్రతను పెంచేందుకు GHMC విజిలెన్స్ విభాగం మరియు హైదరాబాద్ పోలీసు శాఖ సంయుక్తంగా 139 డ్రోన్లను వినియోగించనున్నాయి. నవంబర్ 11న జరిగే పోలింగ్ సందర్భంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ డ్రోన్లు పని చేస్తాయి.

వీటిని 407 పోలింగ్ కేంద్రాలపై విస్తరించి ఏర్పాటు చేయనున్నట్లు విజిలెన్స్ అదనపు ఎస్పీ మరియు MCC నోడల్ అధికారి నరసింహరెడ్డి తెలిపారు.
రియల్‌టైమ్ పర్యవేక్షణతో పారదర్శకత
డ్రోన్ల ద్వారా ఎన్నికల అధికారులు మొత్తం పోలింగ్ ప్రాంతాలపై రియల్‌టైమ్ పర్యవేక్షణ చేయగలరు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు లేదా అక్రమాలు చోటుచేసుకున్నా వెంటనే గుర్తించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
GHMC ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక నియంత్రణ కేంద్రం ఏర్పాటు చేసి డ్రోన్లను మానిటర్ చేయనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సదుపాయం కూడా ఏర్పాటు చేశారు.
భద్రతా చర్యల్లో కీలక పాత్ర
ఈ సాంకేతికతతో పెద్ద సంఖ్యలో ఓటర్ల రద్దీని పర్యవేక్షించడంతో పాటు అవాంఛిత సంఘటనలు నివారించవచ్చని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. సుమారు 4 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించనుండగా, డ్రోన్ల వినియోగం భద్రతా పరంగా కీలకమవుతుంది.
ఈ ఉపఎన్నికలో డ్రోన్ల వినియోగం మొదటిసారి జరుగుతుండగా, భవిష్యత్ ఎన్నికలలో కూడా ఇదే విధానాన్ని అనుసరించడానికి ఇది మోడల్‌గా నిలుస్తుందనే అంచనా వ్యక్తమవుతోంది.
Drones Security In Jubilee Hills అధికారుల ఆవిష్కరణ కార్యక్రమం
ఈ డ్రోన్ పర్యవేక్షణ ప్రాజెక్టును జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ మరియు హైదరాబాద్ జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ కలిసి యూసుఫ్‌గూడలోని కొట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ప్రారంభించారు
Read More: Read Today’s E-paper News in Telugu
