Telanganapatrika (July 08): DR. YSR , ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్మెంట్… ఇవన్నీ అన్నగారి సేవాస్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనాలు . డా. వై. ఎస్. రాజశేఖర రెడ్డి పేరు చెబితేనే ప్రజా సంక్షేమం గుర్తొస్తుంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, పావల వడ్డీకే రుణాలు, జలయజ్ఞం వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి.

2003లో తన పాదయాత్రతో ప్రజల మన్ననలు సంపాదించిన DR. YSR గారు,
- 2004లో INCని అధికారంలోకి తెచ్చారు
- 2009లో మరొకసారి ప్రజల ఆశీర్వాదంతో సీఎంగా విజయవంతమయ్యారు
అదే సంవత్సరం, సెప్టెంబర్ 2, 2009న ఒక హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన అకాల మరణం ప్రజల హృదయాలను వేదించింది.
31 ఏళ్ల రాజకీయ జీవితంలో ఓటమి లేకుండా..,
- 6సార్లు MLA
- 4సార్లు MPగా విజయం సాధించారు.
ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన YSR గారికి జయంతి సందర్భంగా నివాళి.
Read More: Read Today’s E-paper News in Telugu