CV Anand: తెలంగాణలో కీలక పరిపాలనా మార్పు చోటు చేసుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి C V Anand ను రాష్ట్ర ప్రభుత్వం కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)గా నియమించింది.

CV Anand ఎవరూ ఈ సీవీ ఆనంద్?
సీవీ ఆనంద్ 1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన తెలంగాణ హోం డిపార్ట్‌మెంట్‌లో స్పెషల్ సెక్రటరీగా పని చేస్తున్నారు. అంతకుముందు ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు:
హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా , సైబరాబాద్ కమిషనర్‌గా , తెలంగాణ యాంటీ-కరప్షన్ బ్యూరో డీజీగా పోలీస్ శాఖలో ఆయనకు విస్తృత అనుభవం ఉంది.
CV Anand అవార్డులు & సేవలు
2002లో ప్రెసిడెంట్ గాలంట్రీ మెడల్ అందుకున్నారు , నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సేవలు అందించారు , చట్టం & శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు.
పదవి మార్పు వివరాలు
ప్రస్తుత డీజీపీ B Shivadhar Reddy ఈ నెల చివరలో రిటైర్ కానున్నారు. ఆయన స్థానంలో సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టనున్నారు.
తెలంగాణలో పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఈ నియామకం కీలకంగా భావిస్తున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
