TELANGANAPATRIKA (June 23):Constable Suspended for Forgery. సంఘటనతో కామారెడ్డి జిల్లా పోలీస్ విభాగం లో కలకలం రేగింది. ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్ కె. రవికుమార్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసినట్టు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ప్రకటించారు.

Constable Suspended for Forgery ఏఎస్‌ఐ సంతకాల ఫేక్, తప్పుడు నివేదికలు
పెద్దకొడప్గల్ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న సమయంలో బస్ వారంట్లు, ఏఎస్‌ఐ సంతకాలు ఫోర్జరీ చేసి వాటిని దుర్వినియోగం చేశాడు. విధులకు గైర్హాజరై ఉన్నప్పటికీ పై అధికారుల పేరుతో తప్పుడు నివేదికలు సమర్పించినట్టు ఆరోపణలు ఉన్నాయని ఎస్పీ తెలిపారు.
డీఎస్పీ నివేదిక ఆధారంగా చర్య
ఈ వ్యవహారంపై బాన్సువాడ డీఎస్పీ సమర్పించిన నివేదికను పరిశీలించిన అనంతరం ఎస్పీ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న రవికుమార్‌ను సస్పెండ్ చేశారు.
బాధ్యతారాహిత్యంపై హెచ్చరిక
ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, “పోలీసులు లేదా ఏ ఇతర ప్రభుత్వ ఉద్యోగులు అయినా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే, చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు.
Read More: Read Today’s E-paper News in Telugu
