Communist Party of India: పౌరుల ప్రాణాలకు రక్షణ కల్పించకుండా ఉగ్రవాద చర్యలను స్వార్థ రాజకీయాలకు ముడి పెట్టడం దారుణం!

Communist Party of India. అకారణంగా దేశ పౌరుల ప్రాణాలను తీసే ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఎదుర్కోవాలని ఉగ్రవాద చర్యలను, ఉగ్రవాద చర్యల్లో ప్రాణాలు కోల్పోయిన పౌరుల జీవితాలను తమ స్వార్ధ రాజకీయాల కోసం ఉపయోగించుకునే పాలకుల కుట్రలను బట్టబయలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య వేదిక (టి ఎస్ డి ఎఫ్) రాష్ట్ర బాధ్యులు నైనాల గోవర్ధన్ గుర్రం విజయ్ కుమార్ పిలుపునిచ్చారు.

Join WhatsApp Group Join Now

communist party of india tsdf joint meeting left parties public groups


స్థానిక ఓంకార్ భవన్లో తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక (టిఎస్డిఎఫ్) ఆధ్వర్యంలో ఎంసిపిఐ(యు), న్యూ డెమోక్రసీ, సిపిఐ(ఎంఎల్), న్యూ డెమోక్రసీ (చంద్రన్న వర్గం) రైతు ప్రజాసంఘాల సంయుక్త సమావేశం ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ పహెల్గాంలో పర్యటకులపై విచక్షణారహితంగా ఉగ్రవాదులు జరిపిన దాడి హేయనీయమైనదని ఉగ్రవాదుల దాడులను పాకిస్తాన్ కుట్రలను అడ్డుకోవలసిన కేంద్ర ప్రభుత్వం తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా భారత పౌరులను చీల్చే విధంగా చర్యలు చేపట్టడం సిగ్గుమాలిన చర్య అన్నారు. పర్యాటకులకు తగిన భద్రత కల్పించడంలో విఫలమైన కేంద్రం పాకిస్తాన్ పై దాడి చేసి ఎంతో సాధించామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని పౌరుల ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని మనిషిని మనిషి చంపుకుని దోచుకునే విధానాలకు స్వస్తి చెప్పి మనుషుల మధ్య మానవత్వాన్ని సామరస్యతను మేల్కొల్పే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ క్రమంలో ప్రజల్లో చైతన్యాన్ని నింపేందుకు పాలకులను మేల్కొల్పేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక ప్రయత్నిస్తున్నదని అందులో భాగంగా జూన్ 14వ తేదీన వరంగల్ నగరంలో భారీ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశాన్ని రక్షించుకునేందుకు సమానత్వాన్ని పొందేందుకు ప్రజలు ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున కదలి రావాలని పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో ఎంసిపిఐ(యు)‌ నుంచి గోనె కుమారస్వామి ఎన్ రెడ్డి హంసారెడ్డి మంద రవి నర్ర ప్రతాప్ సుంచు జగదీశ్వర్, సిపిఐ ఎంఎల్ నుంచి మోడం మల్లేశం, న్యూ డెమోక్రసీ నుంచి రాచర్ల బాలరాజు గంగుల దయాకర్ ఎలకంటి రాజేందర్, చంద్రన్న వర్గం నుంచి నున్న అప్పారావు మొగిలి ప్రతాపరెడ్డి, ఇనాం నుంచి జుబేర్ మహమ్మద్, కాజా అస్లం, ఎంయుడిఎం నుంచి అబ్దుల్ సుభాన్ రైతు సంఘం నుంచి సోమిడి శ్రీనివాస్, ఊరటి హంసల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More: Covid 19 Cases India పెరుగుతున్నాయి: కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం, నూతన మార్గదర్శకాలు విడుదల!

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics, clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest, making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →