
మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు ప్రారంభించాలి- జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
TELANGANA PATRIKA (MAY 20) , మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, యువత, విద్యార్థులు మత్తుపదార్థాల బారిన పడకుండా చూడాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
కలెక్టర్ పమేలా సత్పతి సమావేశంలో మాట్లాడుతూ….
జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్, ఎక్సైజ్ అధికారులు సమన్వయంతో పని చేస్తూ కరీంనగర్ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అన్నారు. డ్రగ్స్ మూలాలను పెకిలించి వేయాలని పేర్కొన్నారు. కళాశాలలు, వివిధ వసతి గృహాలను సందర్శించాలని, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి పెడదోవ పట్టకుండా చూడాలని ఆదేశించారు.
విద్యార్థులు డ్రగ్స్ బారిన పడిన పడకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై కూడా ఉందన్నారు. మాదకద్రవ్యాల నిరోధక కమిటీలను బలోపేతం చేయాలని తెలిపారు. రానున్న రోజుల్లో మాధకద్రవ్యాల నియంత్రణకు మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. డ్రగ్స్ నిర్ధారణ కిట్లను తెప్పించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారులు మాదకద్రవ్యాల నిర్మూలనకు తీసుకున్న చర్యలను గురించి వివరించారు. 2022 నుండి ఇప్పటివరకు 122 కేసులు నమోదు చేశామని, 115 మందిని బైండోవర్ చేసామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, ఏసిపి మాధవి, డి.డబ్లు.ఓ సరస్వతి, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, సిఐలు రాము, బాబా, పుల్లయ్య పాల్గొన్నారు.
Also Read : డెంగ్యూ నివారణకు ముందస్తు అవగాహన సదస్సు నిర్వహణ..!