కలెక్టర్ హనుమంతరావు యువత అభివృద్ధే లక్ష్యంగా రాజీవ్ పథకం..

TELANGANA PATRIKA (MAY24) , శనివారం కలెక్టర్ కార్యాలయంలో రాజీవ్ యువ వికాస పథకం పై కలెక్టర్ హనుమంతరావు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తో సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ…

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాస పథకం నిరుద్యోగుల ఆర్థిక ప్రగతిని పెంపొందించే విధంగా యూనిట్ల ఎంపిక జరగాలన్నారు.ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ ఈ బి సి నిరుద్యోగుల కుటుంబాల జీవన ప్రగతి రాణించే విధంగా రాజీవ్ యువ వికాస పథకం క్రింద యూనిట్లను నెలకొల్పుకునే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు.అన్ని కుటుంబాలకు సమన్యాయం జరిగే విధంగా పారదర్శకతతో చేపట్టాలన్నారు. లబ్ధిదారులకు యూనిట్ల ఎంపిక విధానం అవగాహనతో జరగాలన్నారు.నిరుద్యోగుల పాలిట వరంగా రాజీవ్ యువ వికాస పథకం నిలవాలని, సాధికారిత సాధించే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు.ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి డిఆర్ డిఏ పిడి నాగిరెడ్డి,ఎస్సీ కార్పొరేషన్ ఈడి శ్యాంసుందర్,బీసీ సంక్షేమ అధికారి యాదయ్య,తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

Also Read : Rajiv Yuva Vikasa: లోన్ కావాలా….. సిబిల్ స్కోర్ తప్పనిసరి…!

Advertisement

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →