Chinthakunta Vijaya Ramana Rao: సుల్తానాబాద్ పట్టణంలోని ఐబి చౌరస్తా నుంచి రోడ్డు విస్తరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న ఆర్ అండ్ బి గదులను కూల్చివేసి వాటి స్థానంలో కొత్తగా గదుల నిర్మాణానికి బుధవారం రోజునస్థానిక నాయకులతో కలిసిస్థానిక పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.ఈ సందర్బంగావారు మాట్లాడుతూ.

ఐబీ చౌరస్తా నుంచి గట్టపెల్లి రోడ్డు వరకు రోడ్డు వెడల్పు కార్యక్రమాలతో పాటు నూతన రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.ఈ నేపథ్యంలో ఐబి చౌరస్తా నుంచి ఉన్న వాణిజ్య సముదాయ గదులను కూల్చివేసి వాటి వెనుక భాగంలో కొత్తగా గదులను నిర్మిస్తున్నాం అని అన్నారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో Chinthakunta Vijaya Ramana Rao ఎమ్మెల్యే పాల్గొని కొత్త గదుల నిర్మాణం పూర్తయిన తర్వాతనే ముందున్న దుకాణాలను కూల్చివేయాలని అన్నారు. పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు సుల్తానాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఐబి చౌరస్తాను. విస్తరించి రోడ్డును వెడల్పు చేసేందుకు జిల్లా కలెక్టర్ చొరవతో ముందుకు వెళుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ అధికారులతో పాటు మున్సిపల్ కమిషనర్, మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, నాయకులు సాయిరి మహేందర్, అబ్బాయి గౌడ్,చిలుక సతీష్,బిరుదు కృష్ణ, రఫీ మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More: Peddapalli: పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయిలో సేవలు – ప్రజలకు భరోసా!
Comments are closed.