chenetha handlooms 2025 : ఉపాధి కోల్పోయిన నేతన్నలు గర్శకుర్తి మగ్గాల వెనుక కనిపించని బాధ.

Telanganapatrika (July 14) : chenetha handlooms 2025. ఒంటి పై చొక్కలేని నేతన్న విగ్రహం చూస్తుంటే వాళ్ల జీవితాల్లో కూడా ఎలాంటి మార్పు లేనట్టే కనిపిస్తోంది అనుకుంటా ముచ్చట్లు మొదలుపెట్టిండు దయానంద్. సురభి హోటల్లో చాయ్ తాగుతూ మా ముచ్చట్లు కొనసాగుతున్నాయి. వచ్చి పోయే వాహనాల చేస్తున్న శబ్దాలు మనిషిని పరుగులు పెట్టిస్తున్న పరిస్థితులు ఆపకుండా చెబుతూనే ఉన్నాడు దయానంద్. నాలుగు రోజుల కి ముందు చూడనీకి పోయిన గర్షకుర్తి చుట్టూ నా ఆలోచనలు పోయినాయి.

chenetha handlooms 2025 Garshakurthi చేనేతభం – నేతన్న బతుకు

chenetha handlooms 2025:

బహుశా ఏప్పుడో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఆ ఊరికి పోయి నుంటిమి. అప్పటికి సిరిసిల్లలో నేత కార్మికుల ఆత్మహత్యలు వరుసగా జరుగుతున్న జరుగుతున్న కాలం. పేపర్ తేరిస్తే చాలు అవి నేత కార్మికుల కన్నీళ్లతో తడిసిపోయినట్లు కనిపించేవి. అట్లా పూర్తిగా సమస్యల్లో చిక్కుకుపోయిన సిరిసిల్ల ఆనాటి రోజుల్లో ఎంత దుఃఖాన్ని మోసిందో. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ వచ్చి పోవడం ఆధునీకరణ మొదలుపెట్టి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ దిగిపోవడం కాలక్రమంలో వచ్చిన మార్పులు. నేతన్నల ప్రత్యూమ్నాయ ఉపాధి కోసం వెతుకులాట. రోజువారి వార్తల్లో పడి కొట్టుకుపోతున్న పరిస్థితి. ఆ పరిస్థితిలోనే మరమగ్గాల పరిశ్రమ మూలాలను వేదుకుతున్న క్రమంలో గర్శకుర్తి, చామన్ పల్లి చొప్పదండి ఇలా కొన్ని ప్రాంతాలు తిరిగిన జ్ఞాపకాలు చుట్టూ సుడులు తిరుగుతున్నాయి. ఒక్క సిరిసిల్ల మాత్రమే ఎందుకు సంక్షోబితంగా మారిపోయింది. అన్న అనేక ప్రశ్నలు వెంటాడుతుంన్నై.

Advertisement

ప్రత్యామ్నాయ ఉపాధికి పోరాటం – ఒక తరం గర్జన

సహజంగా పోటాపోటీ గా పరిగెడుతున్న ప్రపంచంలో సొంతంగా తమ ఉత్పత్తులకు మార్కెట్ వెతుక్కున్న గర్శకుర్తి, ఆ నాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొన్ని గ్రామాలు ప్రత్యేకంగా కనిపించేవి. ఉత్తర తెలంగాణకు ప్రత్యేకంగా చేనేత ఉత్పత్తుల విక్రయానికి కేంద్రంగా పనిచేసిన శనివారం అంగడి చుట్టు అల్లుకున్న చేనేత కార్మికుల జీవితాలు ఒక తరం ఎదురిదుతున్న దృశ్యాలు కనిపించేవి. ” సాలోని బతుకు శనివారం అంగడి” అన్న నానుడి గుర్తొచ్చేది. అక్కడ అప్పుడప్పుడు ఉద్యోగం నుంచి కొంతకాలం విరామం తప్ప, తమ నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితిని చూసినుంటి.మరమగ్గాల విస్తరణ కాకుండా అక్కడి నేతన్నలు మార్కెట్ ఉన్నంతవరకే పరిమితం అవుతూ స్థిరంగా నిలబడడం అప్పట్లో ఆ గ్రామాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నప్పుడు కనిపించేది.

దాదాపు 15 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత గర్శకుర్తి లాంటి ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని ఆసక్తి మొదలైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆధునీకరణ తోపాటు బతుకమ్మ చీరల ఆర్డర్లు పరిశ్రమలు బతికించ లేకపోయాయన్న నిర్ధారనే సిరిసిల్ల పరిస్థితిలను గమనించినప్పుడు కనిపించింది. సిరిసిల్లలో ఉన్న మూడంచెల వ్యవస్థ బతుకమ్మ చీరల ఆర్డర్లతో కొత్త రూపం తీసుకున్నట్లు కనిపించింది. కాటన్ కు అనుబంధం గా ఉన్న డైయింగ్ సైజింగ్ పరిశ్రమల ఉనికిని ప్రశ్నార్థకం చేసి పోయిన పరిస్థితులతో పాటు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో చిన్న మధ్య తరహా పారిశ్రామికులు క్రమక్రమంగా కనుమరుగు అవుతున్న పరిస్థితిలు కనిపించాయి.

Advertisement

గతంలో బతుకమ్మ చీరల ఆర్డర్లలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించిన ప్రస్తుత ప్రభుత్వం విచారణ లేకుండా బిల్లులు చెల్లింపు చేయడం కొంచెం ఆశ్చర్యమే అనిపించింది. కాటన్ ఉనికిని కోల్పోయి పాలిస్టర్ మార్కెట్ ని కోల్పోయి ప్రభుత్వ ఆర్డర్ల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితులు ఎందుకు వచ్చాయన్న ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరుకుతుందో ,సహకార వ్యవస్థతో సమృద్ధిగా మారాల్సిన పరిశ్రమ ఎందుకు ఇలా చతికిలబడింది. అన్న ప్రశ్నలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆర్డర్ల కోసము అటెంక బిల్లుల కోసం మళ్లీ ఆర్డర్ల కోసం పోరాటం చేయవలసిన పరిస్థితిలోకి సిరిసిల్ల నేత కార్మికులు ఎందుకు నెట్టి వేయబడ్డారు. అంత దారం చిక్కుబడ్డట్లు అనిపిస్తుంది. పాలిస్టర్ కాటన్ మార్కెట్లు ఇచ్చల్కరంజి మాలేగాము వైపు వెళ్లిపోయిన పరిస్థితులు ఇక్కడ సంక్షోభాలను మోయాల్సిన దుస్థితికి కారణం ఎవరన్నది పైకి చెప్పకపోయినా వాస్తవాలు కనిపిస్తునే ఉన్నై.

chenetha handlooms 2025 latest news The Crisis of Telangana Village Weavers

గర్శకుర్తి ఏమైనా కొత్త దారి చూపుతోందా చూడాలని బయలుదేరినాం. ఊర్లోకి అడుగుపెడుతోనే వినిపించే మగ్గం , మర మగ్గం చప్పులు ఎక్కడ వినిపిస్తలేవు. ఊరంతా తెలియని దుఃఖమేదో పరుచుకున్నట్లే కనిపిస్తోంది. కళ తప్పి కన్నీళ్లను దాచుకుంటున్నట్లే అనిపించింది. మెల్లిగా గ్రామంలో తిరుగుతూ పోతున్నాం. ఊరు ఇప్పుడు “తేరువు” కోసం తల్లడిల్లుతున్న పరిస్థితిలే అడుగడుగునా కనిపించాయి. అట్లా ఊర్లోని బందుపడ్డ మర మగ్గాల రేకులు షెడ్డులు చూస్తూ పోతుంటే అనేక పరిణామాలు కండ్లమందు నడిచిపోతున్నట్టు అనిపించింది. అక్కడ నేతన్నలను ఎవర్ని మందలించిన ప్రభుత్వం మళ్లీ బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇవ్వాలన్న అభ్యర్థినే కనిపించింది. బహుశా ఇది నేను ఊహించని సమాధానం. ఒకనాటి నేత పారిశ్రామికుడు శ్రీనివాస్ జరిగిపోయిన పరిణామాలు గుర్తుచేస్తూ తను గతంలో నాలుగు మర మగ్గాలపై సొంతంగా ఉత్పత్తులు తయారు చేసేవాడిననీ చెప్పుకొచ్చాడు. తువ్వాలను కర్చీఫ్లు గోషికట్టు చీరలు నేసే వాళ్ళమని వాటికోసం స్థానికంగా నే కాకుండా జగిత్యాలనుంచి నిజామాబాద్ వరకు ఇలా అనేక ప్రాంతాల్లో ప్రత్యేకంగా మార్కెట్ ఉండేదని చెప్పుకొచ్చాడు.

సిరిసిల్లలో నడుస్తున్న బతుకమ్మ చీరల ఆర్డర్లు క్రమక్రమంగా గర్షకుర్తి కి కూడా రావడం ప్రారంభమైంది.

అట్లా తనకున్న నాలుగు సంచాల స్థానంలో 8 జోడిలకు విస్తరించినా ఇప్పుడు చేతిలో పనీ లేకుండా అయ్యిందని చెప్పుకొచ్చాడు. గతంలో మార్కెట్లో కర్ణాటక ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాల నుంచి ప్రవేశించడంతో మార్కెట్ చేజారిపోయిందని తెలిపాడు. ఇప్పుడు ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వకపోవడంతో మర మగ్గాలపై బూజు పేరుకుపోయిన తన కార్ఖానా ను చూపించాడు. యువ పారిశ్రామిక వేత్తగా ఎదగాల్సిన అతడు ఉన్నపని పోగొట్టుకొని ప్రస్తుతం కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగించే దుస్థితికి నెట్టబడ్డాడు. 500 పైగా మరమగ్గాలు మూతపడ్డ పరిస్థితి గురించి తాను చెప్పుకొచ్చాడు. ప్రభుత్వం ఏమైనా ఆర్డర్ ఇస్తే తమకు ఉపాధి ఉంటుందని కోరుతున్న అతని ఆవేదన అర్థమవుతుంది.

Advertisement

తమ కాళ్లపై తమ నిలబడతూ మరి కొందరికి పని కల్పించి దశ నుంచి తామే పని కోసం తల్లడిల్లుతున్న పరిస్థితి చూస్తుంటే తెలియని బాదేదో కలవర పెడుతున్నట్లు అనిపించింది. మరికొంత మందిలో చేనేత చట్టాల పరిధిలో కి తీసుకొచ్చి తమను అధికారులు వేధిస్తారేమో అన్న ఆవేదన కనిపించింది. మొత్తానికి ఊరంతా కనిపించని దుఃఖా లేవో మోస్తున్నట్లుఉంది.కో-ఆపరేటివ్ సెక్టర్లోకి వస్త్ర పరిశ్రమను తీసుకురమ్మని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచనలు చేసింది. కానీ ప్రభుత్వమే ఆర్డర్లు ఇవ్వాలని సూచనలు అయితే చేయలేదు.

ఒక సమయంలో అధికారులు బలవంతంగా బతుకమ్మ చీరల ఉత్పత్తిని సిరిసిల్లాలో చేయించిన రోజులు కండ్ల ముందు తిరుగుతున్నాయి. ఏమైనా ఉంటే పరిశ్రమకు ప్రోత్సాహకాలు ఇవ్వాలె. ప్రభుత్వమే ఆర్డర్లు ఇవ్వడం ఇప్పటి పరిస్థితి కారణం అనిపిస్తుంది. అంటూ మిత్రుడు చెప్పిన మాటలు నిజమేమో అనిపిస్తుంది. చేల్లచెదురైపోయి జీవితం చిన్న భిన్నమైపోయి నేత బతుకుల్లో భాగమైన ఈసిరేలు చూపలేకపోయిన వార్తలు మింగేసిన వాస్తవాలు అనేక కోణాలలో ప్రశ్నిస్తున్నట్లె అనిపించింది. ప్రభుత్వాలు పథకాల ముసుగులు కప్పి ప్రచార ఆర్భాటాలు చేస్తుంటే తేరువును కోల్పోయిన తరం ప్రత్యామ్నాయ ఉపాధిని వెతుక్కుంటున్నా దృశ్యాలు కనిపిస్తున్నన్నై. అన్న అన్న అని దయానంద్ గట్టిగా పిలుసుడు తోనే ఈ లోకానికి వచ్చిన చూస్తే కాళీ చాయ్ కప్పు టేబుల్ పై పెట్టి బయట పడ్డం. ఎందుకో నేతన్నల బతుకులు కూడా ఖాళీ కప్పు లాగే కనిపించినై…

మీరు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా సరే — తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేదా ఇతర ప్రాంతాలు — www.telanganapatrika.in లో రాష్ట్రాలు, రాజకీయాలు, ఉద్యోగాలు, విద్య, మరియు పబ్లిక్ ఇంటరెస్ట్ కు సంబంధించిన విశ్లేషణాత్మక వార్తలు అందుబాటులో ఉంటాయి.

Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 2 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →

One Comment on “chenetha handlooms 2025 : ఉపాధి కోల్పోయిన నేతన్నలు గర్శకుర్తి మగ్గాల వెనుక కనిపించని బాధ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *