Telanganapatrika (July 20): caste survey telangana report 2025 , కుల గణాంకాలపై రూపొందించిన 300 పేజీల కీలక నివేదికను న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని నిపుణుల బృందం తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు కలిసి స్వీకరించారు. కాంగ్రెసు ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ స్థితిగతుల సమీక్షను ఆధారంగా చేసుకొని రూపొందించిన ఈ నివేదికను వచ్చే క్యాబినెట్ సమావేశంలో చర్చకు పెడతామని సీఎం తెలిపారు.

Caste survey telangana report 2025.
ఈ నివేదిక ఆధారంగా రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించే ప్రక్రియ మొదలవనుంది. ఇప్పటికే గవర్నర్‌కు ఆర్డినెన్స్ పంపిన ప్రభుత్వం, హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30 లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నివేదికను సీఎం “తెలంగాణకు మెగా హెల్త్ చెకప్ ఎక్స్‌రే”గా అభివర్ణించారు.
నిపుణుల బృందం రాష్ట్రంలోని 242 కులాలపై ‘కాంపోజిట్ బ్యాక్‌వర్డ్‌నెస్ ఇండెక్స్ (CBI)’ను రూపొందించింది. ఈ గణాంకాల ఆధారంగా ప్రతీ కులానికి ఒక స్కోర్, ర్యాంక్ ఇచ్చారు. కమిటీ సభ్యులుగా కాంచ ఐలయ్య, ప్రవీణ్ చక్రవర్తి, శాంత సింహా, సుఖదేవ్ థోరట్, హిమాంశు, నిఖిల్ డే, భంగ్యా భూక్య, పురుషోత్తం రెడ్డి వంటి ప్రముఖులు ఉన్నారు.
Read More : Telangana 42% BC Reservation : చిన్నకోడూరులో సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం.
బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ మాట్లాడుతూ – ఈ నివేదిక సామాజిక న్యాయానికి ఒక శక్తివంతమైన పరికరంగా ఉపయోగపడుతుందన్నారు. ప్రజల్లో పారదర్శకత కోసం నివేదికను పబ్లిక్ చేయాలని సూచించారు.
One Comment on “caste survey telangana report 2025 : బీసీలకు 42% రిజర్వేషన్లపై కీలక నివేదిక.”