BJP Vemulawada: బీజేపీ ఆధ్వర్యంలో హిందూ ఏక్తా యాత్ర పోస్టర్ ఆవిష్కరణ..!

TELANGANA PATRIKA (MAY 10) , BJP Vemulawada : వేములవాడ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో హిందూ ఏక్తా యాత్ర పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ, గత పదిహేను ఏళ్లుగా పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో ఈ యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

BJP Vemulawada మే 22న కరీంనగర్‌లో హిందూ ఏక్తా యాత్ర

ఈ యాత్ర 2025 మే 22న కరీంనగర్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి వేములవాడ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల దేశంలో హిందువులపై జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకుని, హిందూ సమాజ ఐక్యతను చాటేందుకు ఈ యాత్ర ఎంతో ప్రాధాన్యత కలిగినదని ప్రతాప్ రామకృష్ణ అన్నారు.

Advertisement
Advertisement

ఈ కార్యక్రమంలో కోల కృష్ణ, రేగుల మల్లికార్జున్, రేగుల రాజ్ కుమార్, వివేక్ రెడ్డి, కట్కం శీను, అన్నం నరసయ్య, గుంటి కనకయ్య, గుడిసె మనోజ్, వాసం మల్లేశం, బిల్ల కృష్ణారి, సగ్గు రాహుల్, నామాల శేఖర్, సాయి, రేగుల శ్రీకాంత్, రంజిత్ రెడ్డి, తడుక రాజు, బచ్చువంశీ, నాగరాజు, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read : Bomb Squad Inspections : వేములవాడ బాంబు స్క్వాడ్ తనిఖీలు 2025..!

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

Comments are closed.