Birla Mandir: హైదరాబాద్ నగరంలోని ప్రసిద్ధ బిర్లా మందిర్ 2026లో 50వ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతోంది. ఈ సందర్భంగా ఆలయానికి ప్రత్యేక అందం చేకూర్చేందుకు తెల్లని మర్బుల్ శుభ్రపరిచే పనులు ప్రారంభమయ్యాయి.

Birla Mandir 50 ఏళ్ల చరిత్ర..
రాజస్థాన్ నుంచి నైపుణ్య శిల్పకారులు రావడంతో, ప్రధాన గోపురం సహా ఆలయంలోని ఇతర దేవాలయాల శిఖరాలకు పాలిష్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక రసాయన పదార్థాలు ఢిల్లీ నుంచి తెప్పించబడ్డాయి.
ఆలయ నిర్వాహకులు చెబుతున్నట్లు – ఈ పాలిషింగ్‌తో ఆలయం మళ్లీ కొత్తగా మెరిసిపోతుంది. భక్తులు వచ్చే రోజుల్లో మరింత అద్భుత దృశ్యాన్ని చూడబోతున్నారని వారు తెలిపారు.
మొదట ప్రధాన మందిరం గోపురంపై పనులు జరుగుతుండగా, ఆ తరువాత పద్మావతి, ఆండాల్, గరుడ, హనుమాన్, గణేశ్, శివాలయాలపై కూడా శుభ్రపరిచే కార్యక్రమం చేపడతారు.
280 అడుగుల ఎత్తైన నౌబత్ పహాడ్‌పై నిర్మించబడిన ఈ ఆలయం, 13 ఎకరాల్లో విస్తరించి, దాదాపు 2,000 టన్నుల తెల్ల మర్బుల్‌తో నిర్మించబడింది.
ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 6,000 మంది భక్తులు ఇక్కడకు వస్తారు. వీకెండ్‌లలో ఈ సంఖ్య 20,000 దాటుతుందని నిర్వాహకులు తెలిపారు.
Read More: Read Today’s E-paper News in Telugu
