Bigg Boss 9 Telugu: సెప్టెంబర్ 7న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోరాహోరీగా సాగుతోంది. ఇప్పటికే షో మూడో వారంలోకి అడుగుపెట్టింది. తొమ్మిది మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి రెండు వారాల్లో శ్రష్టి వర్మ (సెలబ్రిటీ) మరియు మనీష్ మర్యాద ఎలిమినేట్ అయ్యారు.

Bigg Boss 9 Telugu బిగ్ బాస్ స్పెషల్ రూల్స్
ఈ వారం నామినేషన్స్ మరింత ఆసక్తికరంగా మారాయి. బిగ్ బాస్ ఒక ట్విస్ట్ పెడుతూ –
ప్రతి టెనెంట్ ఐదుగురిని నామినేట్ చేయాలి.
అందులో ఒకరు తప్పనిసరిగా టెనెంట్ అయి ఉండాలని కండిషన్ పెట్టాడు.
దీంతో హౌస్‌లో ఘర్షణలు, మాటల యుద్ధాలు జరిగాయి.
మూడో వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్
ఈ వారం నామినేషన్స్‌లో చోటు దక్కించుకున్న కంటెస్టెంట్స్ ఇవే:
- రాము రాథోడ్
- రీతూ చౌదరి
- ప్రియా
- హరిత హరీష్
- కల్యాణ్
- ఫ్లోరా సైనీ
హౌస్‌లో హీట్ పెంచిన నామినేషన్స్
ఈ వారం నామినేషన్స్‌లో శ్రీజ, ప్రియ, హరిత హరీష్, ఫ్లోరా సైనీ, ఇమ్మాన్యుయేల్, భరణి ఒకరిపై ఒకరు మాటలతో తలపడ్డారు. హౌస్‌లో చిన్నపాటి యుద్ధం వాతావరణం నెలకొంది. ఇక బిగ్ బాస్ తరచూ ట్విస్టులపై ట్విస్టులు ఇస్తుండటంతో మంగళవారం మరిన్ని మార్పులు రావచ్చని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
