Bandlaguda Missing Girl Case: హైదరాబాద్‌లోని బండ్లగూడ పోలీసులు వేగంగా స్పందించి కనిపించకుండా పోయిన నాలుగేళ్ల చిన్నారిని కేవలం రెండు గంటల్లో గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

పోలీసుల వివరాల ప్రకారం, ఘౌస్‌నగర్ ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి బుధవారం మధ్యాహ్నం కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన చిన్నారి తల్లి మధ్యాహ్నం 2 గంటల సమయంలో బండ్లగూడ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు.
Bandlaguda Missing Girl Case ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమై ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లో విచారణ చేపట్టడంతో పాటు సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు.
దర్యాప్తులో లభించిన కీలక ఆధారాల ఆధారంగా పోలీసులు సమీపంలోని ఓ రెసిడెన్షియల్ కాలనీలో చిన్నారిని మధ్యాహ్నం 3.20 గంటల సమయంలో సురక్షితంగా గుర్తించారు. అనంతరం చిన్నారిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఈ సందర్భంగా పిల్లల భద్రతపై తల్లిదండ్రులకు పోలీసులు సూచనలు చేశారు. చిన్నారులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని, అపరిచిత ప్రాంతాల్లో ఒంటరిగా వదిలేయొద్దని హెచ్చరించారు.
Read More: Read Today’s E-paper News in Telugu
