
TELANGANA PATRIKA(MAY30) , అదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో, అత్యుత్తమ సేవలు అందించిన 45 మంది పోలీస్ సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో ఎస్పీ మహాజన్, పోలీస్ స్టేషన్లలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, కేసుల నమోదు మరియు దర్యాప్తులో జాప్యం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సామాగ్రి సిద్ధంగా ఉంచాలని సూచించారు.
అదిలాబాద్ జిల్లా ఎస్పీ నేరాల నివారణకు ప్రత్యేక చర్యలు
ఎస్పీ మహాజన్, గంజాయి వాడకం, నకిలీ విత్తనాల విక్రయం, అక్రమ పశువుల రవాణా వంటి నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి గ్రామంలో విలేజ్ పోలీస్ ఆఫీసర్ల నంబర్లు గోడలపై ప్రదర్శించాలని, డయల్ 100 సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు గస్తీ నిర్వహణను బలోపేతం చేయాలని, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు వంటి చర్యలను ప్రోత్సహించాలని తెలిపారు.
Read More: Read Today’s E-paper News in Telugu