Telanganapatrika (July 20 ): Avopa Arya Vysya Awards 2025 , జమ్మికుంట అవొపా ఆర్యవైశ్య అఫీషిల్స్ అండ్ ప్రొఫెష నల్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆకినపెళ్లి శ్రీనివాస్ అధ్యక్షతన స్థానిక గీతా మందిర్ లో మెరిట్ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా కరీంనగర్ జోనల్ జనరల్ సెక్రెటరీ అయిత ఈశ్వర్ ప్రసాద్, ఈ కార్యక్రమ ప్రధాన వక్త అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వంగల శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా గెజిటెడ్ హెడ్మాస్టర్ల ప్రెసిడెంట్ సుదర్శన్ పాల్గొన్నారు.ఇందులో పదవ తరగతి, ఇంటర్ ,ఇంజనీరింగ్ మరియు మెడికల్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ మరియు సర్టిఫికెట్స్ ను అందజేశారు.

Avopa Arya Vysya Awards 2025.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్యతోనే గుర్తింపు వస్తుందని, ప్రతి ఒక్క విద్యార్థి చదువులో మంచి ప్రతిభ కనబరిచి ఉన్నత శిఖరాలకు చేరాలని అన్నారు. ఉత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లో జోనల్ నాయకులు బచ్చు రమేష్, జమ్మికుంట ప్రధాన కార్యదర్శి కొండ్లె నగేష్ ,ఆర్థిక కార్యదర్శి మంచాల రాంబాబు, మరియు సీనియర్ సభ్యులు డాక్టర్ ముక్క రాజేశ్వరయ్య, రావి కంటి సురేందర్,బాదం రమేష్ బాబు,బచ్చు శివకుమార్ మరియుహుజురాబాద్ అవొపా అధ్యక్షులు ఈశ్వరయ్య మరియుకార్యవర్గ సభ్యులు అయినటువంటి రావికంటి పవన్ కుమార్ తాడిశెట్టి సురేషు, వ్యాంసాని రమేషు,మాడూరి జగదీశ్వర్,తంగేళ్ల పెళ్లి రాజ భాస్కర్, యాద శ్రీనివాస్, పుల్లూరి చంద్రశేఖర్,గోలి సాంబశివుడు,చెట్ల చంద్రమౌళి,జిల్లా బాధ్యులు అయిత సుధాకర్,దేవునూరి సాంబయ్య మీడియా కన్వీనర్ భూపతి సంతోష్, అవొపా సభ్యులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Read More: Cyber Crime Awareness Telangana 2025 – సైబర్ నేరాలు, బాల్య వివాహాల నివారణకు అవగాహన
