Akhil Mahajan IPS News: ఆవు దూడను చంపి అడవి మాంసంగా విక్రయించేందుకు యత్నం – నిందితుడు అరెస్ట్!

Telanganapatrika (June 2): Akhil Mahajan IPS News,  ఆదిలాబాద్ జిల్లా లజైనథ్ మండలం లోని గిమ్మ గ్రామ శివారు ప్రాంతంలో ఆవు దూడను కత్తితో పొడిచి ప్రాణాపాయ స్థితిలో ఉన్నదని సమాచారం తెలిసిన వెంటనే జైనథ్ సిఐ డి సాయినాథ్, ఎస్సై లు వెటర్నరీ డాక్టర్ తో కలిసి సంఘటన స్థలానికి వెళ్లగా, అక్కడ కొన ఊపిరితో ఉన్న దూడను బ్రతికించే ప్రయత్నం చేసినారు. కత్తితో ఆవు దూడను పొడిచిన కారణంగా కొద్దిసేపటికి ఆవు దూడ ప్రాణాలను విడిచింది. ఈ సంఘటన నందు జైనథ్ సీఐ మరియు ఎస్ఐ గౌతమ్ లు విచారణ చేపట్టగా ఆవు దూడ సిరిసన్న గ్రామానికి చెందిన సాయికుమార్ ది అని తేలినది, బాధితుడు ఆవు దూడను పరిశీలించి తనదే అని ధ్రువీకరించారు. ఆవు ను చంపడానికి ఉపయోగించిన ఆయుధం వేటకు ఉపయోగించే బల్లెం లా ఉందని దాని అధారంగా విచారణ ప్రారంభించిన జైనథ్ సిఐ, గిమ్మ గ్రామం కి చెందిన వ్యక్తి రాథోడ్ సంజయ్ మీద అనుమానంతో అతనిని ఈ రోజు అదుపులోకి విచారణ చేయగా అతను నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది అని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు

Advertisement

Akhil Mahajan IPS News

Akhil Mahajan IPS News

నిందితుడు గిమ్మ గ్రామానికి చెందిన వ్యక్తి ఇతనిపై ఇదివరకే మేకలు దొంగతనం చేసిన కేసు, గుడిలో దొంగతనం చేసిన కేసు, ఫారెస్ట్ కేసులు నమోదు అయి ఉన్న విషయాన్ని తెలిపారు. ఇతను ఇలా చంపిన ఆవు దూడను అటవీ జంతువుల మాంసంగా విక్రయించే ప్రయత్నం చేస్తాడని విచారణలో తేలింది అని తెలిపారు. ఇతనిపై జైనథ్ పోలీస్ స్టేషన్ నందు 135 క్రైమ్ నెంబర్ తో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఇట్టి కేసు నందు నేరస్తుని పట్టుకోవడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జైనథ్ సిఐ మరియు ఎస్ఐలను జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ ఐపిఎస్ అభినందించారు. ఆవులను చంపిన, అక్రమం గా రవాణా చేసిన, అక్రమంగా అమ్మిన చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుందని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఉల్లంఘించిన వారిపై సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయబడతాయని హెచ్చరించారు

Advertisement

Advertisement

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →