Telangana patrika(jun 6) , zainab ravzi , ప్రముఖ నటుడు నాగార్జున కుమారుడు అఖిల్ అక్కినేని, జూన్ 6, 2025న జైనబ్ రవ్జీతో తన వివాహ బంధాన్ని మొదలు పెట్టారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో వివాహం సంప్రదాయ తెలుగు పద్ధతిలో జరిగింది.

జైనబ్ రవ్జీ zainab ravzi ఎవరు?
జైనబ్ రవ్జీ ఒక ప్రతిభావంతమైన కళాకారిణి, వ్యాపారవేత్త మరియు మాజీ నటి. ఆమె హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త జుల్ఫి రవ్జీ కుమార్తె. స్కిన్‌కేర్ మరియు సుగంధ ద్రవ్యాలపై ఆసక్తితో “Once Upon The Skin” అనే బ్లాగ్ నిర్వహిస్తున్నారు.
ప్రేమలో రెండు సంవత్సరాలు..
అఖిల్ మరియు జైనబ్ గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వారి నిశ్చితార్థం 2024 నవంబరులో జరిగింది. ఇప్పుడు వారి ప్రేమ బంధం వివాహంతో పునీతంగా మారింది.
వయస్సు వ్యత్యాసంపై సోషల్ మీడియా చర్చ
Akhil Akkineni Zainab Ravzi Wedding తర్వాత, 9 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం చర్చనీయాంశంగా మారింది. అఖిల్ వయస్సు 30 కాగా, జైనబ్ వయస్సు 39. అయితే ఈ విషయాన్ని జంట దృష్టిలో పెట్టుకోకుండా తమ సంబంధాన్ని ప్రేమగా కొనసాగించారు.
సినీ కుటుంబం సమ్మేళనం
వివాహ వేడుకకు నాగార్జున, నాగచైతన్య, రామ్ చరణ్, ఉపాసన, సోభిత ధూళిపాళ తదితరులు హాజరయ్యారు. అఖిల్ తెలుపు ధోతి, జైనబ్ తెలుపు పట్టు చీరలో అద్భుతంగా మెరిశారు.
Read More: Read Today’s E-paper News in Telugu