Telanganapatrika (June 29): Agnipath scheme awareness. మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ మరియు సోల్జర్స్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన అగ్నిపథ్ ఉచిత అవగాహన పరీక్షకు విశేష స్పందన లభించింది. బోథ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దాదాపు 200 మంది యువత హాజరయ్యారు.

ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా హాజరైన బోథ్ ఎస్సై ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, “చదివి కష్టపడితేనే ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యమవుతాయి. నేను కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. చదువు వల్లే ఈ స్థాయికి వచ్చాను. ప్రతి యువకుడు అదే దిశగా కృషి చేయాలి” అని తెలిపారు.
Agnipath scheme awareness నిపుణుల సూచనలు
స్టడీ సర్కిల్ నిపుణులు రమణ గౌడ్, అల్లం సాయి కృష్ణ మాట్లాడుతూ, “పరీక్షల విషయంలో సరైన దిశలో సిద్ధం అయితే విజయానికి అడ్డుకట్ట ఉండదు. ఎవరికైనా డౌట్స్ ఉన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు” అని పేర్కొన్నారు.
చైల్డ్ వెల్ఫేర్ కోఆర్డినేటర్ ఎర్రోల సతీష్, సోల్జర్స్ గ్రూప్ ఫౌండర్ కృష్ణ చౌహాన్ తదితరులు కూడా యువతకు ప్రోత్సాహం ఇచ్చారు. “పేద కుటుంబాల యువత ప్రభుత్వ ఉద్యోగాలవైపు దృష్టి పెట్టాలి. అందుకే సోల్జర్స్ గ్రూప్ ను స్థాపించాం” అని కృష్ణ తెలిపారు.
కార్యక్రమం విజయవంతం
ఈ కార్యక్రమంలో మాసం అనిల్ కుమార్, కుషాల్ రెడ్డి నోముల, కడేర్గుల రాజశేఖర్, జాదవ్ శశి, ఇతర సభ్యులు పాల్గొన్నారు. యువతలో ప్రభుత్వ ఉద్యోగాలపై నమ్మకం పెంపొందించేందుకు ఈ అవగాహన టెస్ట్ ఉపయోగపడింది.
Read More: Read Today’s E-paper News in Telugu