TELANGANAPATRIKA (June 28): Adluri Laxman Kumar. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం ప్రధమసారి కోరుట్ల పట్టణానికి విచ్చేయగా, అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

Adluri Laxman Kumar అంబేద్కర్ విగ్రహానికి నివాళి – సమాజ అభ్యున్నతే లక్ష్యం
ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పిస్తూ, బాబా సాహేబ్ అంబేద్కర్ ఆశయాలను ప్రభుత్వం నిజం చేయడానికి కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు, అంబేద్కర్ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పేట భాస్కర్, పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యానికి అంబేద్కర్ స్పూర్తి – మంత్రుల మాటలు
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, “బాబా సాహేబ్ అంబేద్కర్ కలలు కనిన సమాజ నిర్మాణంలో భాగస్వాములమవుతున్నాం. ప్రతి పేదవాడికి, ప్రతి దళితునికి సమానత్వం కోసం పనిచేస్తాం” అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బలిజ రాజరెడ్డి, పసుల కృష్ణ ప్రసాద్, మోర్తాడ్ లక్ష్మణ్, రాజనర్సయ్య, లక్ష్మీ నారాయణ, నరేష్, మురళి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సంఘ ఐక్యతకు, సామాజిక న్యాయంపై అందరూ అభినందనలు తెలిపారు.
Read More: Read Today’s E-paper News in Telugu