AC Cooling Tips: వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. 40°C దాటిన ఈ వేడి పరిస్థితుల్లో చాలామంది ఉపశమనం కోసం ACలపై ఆధారపడుతున్నారు. అయితే, కొన్ని సందర్భాల్లో ACలు ఆశించినంత కూలింగ్ ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

మీ AC పనితీరును మెరుగుపరచి, గది మరింత చల్లగా ఉండేందుకు ఈ 4 ముఖ్యమైన టిప్స్ తప్పకుండా పాటించండి
AC Cooling Tips 4 సింపుల్ టిప్స్
1.. ఫిల్టర్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి
AC ఫిల్టర్‌పై దుమ్ము పేరుకుపోతే గాలి సరిగా ప్రవహించదు. దీంతో కూలింగ్ తగ్గిపోతుంది. ప్రతి 2 వారాలకు ఒకసారి ఫిల్టర్‌ను క్లీన్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
2. కర్టెన్లు వాడండి
సూర్యకాంతి నేరుగా గదిలోకి వస్తే AC ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. కిటికీలు, తలుపులకు మందపాటి కర్టెన్లు వేస్తే గది త్వరగా చల్లబడుతుంది.
3. సరైన మోడ్‌లో AC పెట్టండి
కొన్ని సార్లు AC “Cool Mode”లో ఉండదు. కూలింగ్ కోసం ఎప్పుడూ Cool Modeనే వాడాలి.
4. తలుపులు, కిటికీలు బాగా మూసి ఉంచండి
వేడి గాలి లోపలికి వస్తే కూలింగ్ తగ్గిపోతుంది. గది పూర్తిగా క్లోజ్ చేసి ఉంచితే చల్లదనం ఎక్కువసేపు ఉంటుంది.
ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మీ AC పనితీరు మెరుగవుతుంది. భారీ ఎండల్లో కూడా మీ గది కూల్‌గా, కంఫర్ట్‌గా ఉంటుంది. ఇకపై AC కూలింగ్ సమస్యతో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు!
Read More: Read Today’s E-paper News in Telugu
