మొంథా తుఫాన్ హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. దుబాయ్ నుంచే సీఎం చంద్రబాబు ఆదేశాలు. 16 ఎన్డీఆర్ఎఫ్ బృందాల మోహరింపు.

తెలంగాణ పత్రిక, వెబ్డెస్క్: మొంథా తుఫాను (Cyclone Montha) హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ (Andhra Pradesh) యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబు తొలుత దుబాయ్ పర్యటనలో ఉన్నప్పటికీ, అక్కడి నుంచే అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తక్షణ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం, మంత్రులు ఆర్టీజీఎస్ (RTGS) ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు.
ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల ప్రజలను, వృద్ధులు, గర్భిణీలను ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించింది. అక్కడ వారికి ఆహారం, మందులు సిద్ధం చేశారు. సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులను వెనక్కి రప్పించి, 50 కిలోల బియ్యం పంపిణీ చేశారు.
సహాయక చర్యల కోసం 16 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ప్రభావిత జిల్లాలకు పంపించారు. ప్రాణనష్టాన్ని నివారించేందుకు, తీరం దాటే సమయంలో ముందుగానే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ప్రతిపక్షాల విమర్శలు ఉన్నప్పటికీ, ప్రభుత్వ చర్యలపై ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
