Hyderabad City Police: హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ఈ సోమవారం రోడ్డు భద్రతను ప్రోత్సహించేందుకు #SafeRideChallenge అనే డిజిటల్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ఛాలెంజ్ ద్వారా యువతను రోడ్డు భద్రతా అలవాట్లను పాటించేందుకు ప్రేరేపించడమే లక్ష్యం.

Hyderabad City Police ఛాలెంజ్ ఎలా చేయాలి:
- బైక్ లేదా స్కూటర్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించండి.
- కారు నడిపేటప్పుడు సీటు బెల్ట్ కట్టుకోండి.
- మీరే ఈ రక్షణా చర్యలు తీసుకుంటున్న వీడియో లేదా ఫోటో తీసి, 3 మంది స్నేహితులు లేదా కుటుంబ సభ్యులను ట్యాగ్ చేయండి.
SafeRideChallenge హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో పంచుకోండి.
లక్ష్యం
ఈ ఛాలెంజ్ ద్వారా రోడ్డు భద్రతపై అవగాహన పెంచడం, ముఖ్యంగా యువతలో రక్షణా అలవాట్లను ప్రోత్సహించడం లక్ష్యంగా ఉంది. ప్రతి ప్రయాణం ప్రారంభంలో రక్షణా చర్యలు తీసుకోవడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే ముఖ్య ఉద్దేశం.
కమిషనర్ వి.సి. సజ్జనార్ వ్యాఖ్యలు..
“ప్రతి ప్రయాణం ఒక నిర్ణయం. మీరే మీ భద్రతకు బాధ్యత వహించాలి. రోడ్డు భద్రతను 2025లో ఫ్యాషన్‌గా మార్చుదాం,” అని సజ్జనార్ అన్నారు.

Read More: Read Today’s E-paper News in Telugu

Comments are closed.