Telanganapatrika (August 02) :Bhadradri Kothagudem – భద్రాద్రి జిల్లా జూలూరుపాడు పోలీస్ స్టేషన్‌కు కొత్త సీఐగా శ్రీలక్ష్మి బాధ్యతలు స్వీకరించిన పూర్తి వివరాలు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీస్ స్టేషన్‌కు నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా దోబ్బల. శ్రీలక్ష్మీ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
ఆమె పోలీస్ స్టేషన్‌లో విధుల్లో చేరారు.ఇప్పటినుంచి జూలూరుపాడు పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు పూర్తి స్థాయిలో తనవంతు కృషి చేస్తానని ఆమె వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసులకు తెలియజేయవచ్చని ఆమె అన్నారు.చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్నపురెడ్డిపల్లి ఎస్‌ఐ చంద్రశేఖర్ మర్యాదపూర్వకంగాకలిసి శుభాకాంక్షలు తెలిపారు.
జూలురుపాడు సర్కిల్ పరిధి లోని పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు నెలకొనేలా తనవంతు కృషి చేస్తానని ఆమె అన్నారు.
తెలంగాణ పోలీస్ అధికారిక వెబ్‌సైట్ : https://tspolice.cgg.gov.in