Telanganapatrika (August 01): ఇసుక దందా స్పీడ్ , వీణవంక మండలంలో శుక్రవారం ఉదయం 6 గంటలకు అక్రమ ఇసుక రవాణా ఇసుక ట్రాక్టర్లు రై రైయ్యమంటూ, రైలు కంటే వేగంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ ను కళ్ళ ముందే చూసినట్టుగా, ఇసుక ట్రాక్టర్ల వేగం రైతులను భయభ్రాంతులను గురిచేసింది.

ఒక్క టాక్టర్ వెంబటి,మరో ట్రాక్టర్ అధిక వేగంతో దూసుకెల్లడంతో ప్రక్కన ఏం జరుగుతుందో ఆలోచించలేని పరిస్థితుల్లో ఉన్నామంటూ, రైతులు భయపడుతున్నారు . ప్రభుత్వ అధికారులు ఇసుక అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపి, రెడ్డిపల్లి గ్రామంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసిన నిష్ప్రయోజనంగా మారిందంటూ, అధికారుల పనితీరుపై మండల ప్రజలు పలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇసుక దందా స్పీడ్ కి గ్రీన్ సిగ్నల్ ఎవరిది..?
మండల కేంద్రంలో ఏకంగా ఒకేసారి ఉదయం పూట పది ట్రాక్టర్లు స్పీడును మించిన అధిక స్పీడ్ తో వెళ్తుంటే, అధికారులు ఏం చేస్తున్నారని, అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునే వారెలేరని, తూ..తూ.. మంత్రంగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారని, అక్రమ ఇసుక రవాణాకు సహకరిస్తుంది ఎవరు..?? అంటూ..సామాన్యులు సైతం అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఉదయం పూట పొలాలకు వెళ్లాలంటే ఇసుక ట్రాక్టర్లతో భయంగా ఉందంటూ, రైతు సోదరులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని, అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని, ప్రకృతి సంపదను కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu