Telanganapatrika (Aug 01): Postal GDS Result 2025 – ఇండియా పోస్ట్ 21,413 పోస్టల్ GDS ఉద్యోగాల ఫలితాలు విడుదల… ఎగ్జాం లేకుండా ఎంపిక, డాక్యుమెంట్ వెరిఫికేషన్కు చివరి తేది ఏమిటి?

21,413 పోస్టల్ GDS ఉద్యోగాలు.. ఫలితాలు విడుదల
ఇండియా పోస్ట్ 2025 సంవత్సరానికి సంబంధించి 21,413 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులకు సంబంధించి ఫలితాలను విడుదల చేసింది. ఇది ఆర్నవ జాబితా కాగా, బుధవారం విడుదలైంది.
ఈ ఫలితాల్లో:
- ఆంధ్రప్రదేశ్‌లో 1215 పోస్టులు
- తెలంగాణలో 519 పోస్టులు
పూర్తి స్థాయిలో భర్తీ అయ్యాయి.
ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూలు నిర్వహించలేదు. అభ్యర్థుల ఎంపిక కేవలం పదవ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా జరిగింది. ఎంపికైన అభ్యర్థులు తమ అసలు ధ్రువపత్రాల వెరిఫికేషన్ను ఆగస్టు 14, 2025లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
Postal GDS Result 2025.
ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్: https://indiapostgdsonline.gov.in
Read More: Telangana Teachers – ప్రభుత్వ ఉపాధ్యాయులకు అలర్ట్! ఆగస్టు 1 నుంచి ఫేస్ రికగ్నేషన్ హాజరు – డుమ్మా కొట్టితే చెక్!
పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో విద్యా అర్హత, స్థానికత ధృవీకరణ, వయసుతో పాటు ఇతర అవసరమైన పత్రాలు సమర్పించడం అవసరం.
One Comment on “Postal GDS Result 2025: 21,413 పోస్టుల ఫలితాలు విడుదల”