Telanganapatrika (July 29): PDSU School Hostel Issues Nizamabad – నిజామాబాద్‌లో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్ శిధిలావస్థలో ఉన్నాయని వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.

PDSU School Hostel Issues Nizamabad.
- ప్రభుత్వ స్కూల్స్ హాస్టల్స్ భవనాలు పట్టవా..?
- శిధిలావస్థలో ఉన్న భవనాలు వెంటనే మరమ్మతులు చేయాలి – పి డి ఎస్ యూ డిమాండ్
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు స్టూడెంట్ మేనేజ్ మెంట్ హాస్టల్స్ భవనాల మరమ్మతులు చేయించాలనీ పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు..
పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్ లో మీడియాతో మాట్లాడారు. నాయకులు మాట్లాడుతూ వర్షాకాలంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ హాస్టల్స్ లో విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని పరిసరాలు పరిశుభ్రంగా లేనందున దోమలతో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారని చెప్పుకొచ్చారు.
అన్ని హాస్టల్స్ స్కూల్స్ లో కిటికీలకు దోమ తెరలు పెట్టాలని, హాస్టల్స్ లో ఏ ఎన్ ఎం లను నియమించాలని ఫుడ్ పాయిజన్ ఘటనలు పునవృతం కాకుండా నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం విద్యార్థులకు అందించాలని డిమాండ్ చేశారు.. స్థానిక వార్డెన్స్ విద్యార్థులకు అందుబాటులో ఉండాలని రాత్రి వేళల్లో ర్యాగింగ్ జరగకుండా చూడాలని స్థానిక ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు హాస్టల్స్ లను సందర్శించాలని కోరారు..
తెలంగాణ పాఠశాల విద్యా శాఖ అధికారిక వెబ్‌సైట్ – https://schooledu.telangana.gov.in
Read More: CI Mutyam Ramesh – వెంకటాపురంలో వాదబలిజ సంఘం స్వాగతం!
One Comment on “PDSU School Hostel Issues Nizamabad – ప్రభుత్వ భవనాలపై ఆందోళన!”