Telanganapatrika (July 27) : Bandi Sanjay cycle program, భారతదేశ ప్రధాని మోడీ స్పూర్తితో, వికసిత్ భారత్ లక్ష్యంగా సాగుతున్న నవ భారతంలో విద్యార్థుల భవిష్యత్ కు దూరం అనేది విద్యకు అడ్డుకాకూడదని, పాఠశాలల్లో డ్రాపవుట్లు తగ్గించాలనే సదుద్దేశంతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 20వేల సైకిళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టడం జరిగింది. వీణవంక మండలం కేంద్రంలో శనివారం సైకిల్ల పంపిన కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు బత్తిని నరేష్ గౌడ్, మండల విద్యాధికారిణి శోభారాణి లు కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ… భవిష్యత్తులో అన్ని తరగతుల విద్యార్థులకు ‘మోదీ కిట్స్’ పేరుతో బ్యాగ్, ఒక వాటర్ బాటిల్, పుస్తకాలు అందివ్వాలని నిర్ణయించారని, పేదరికం వల్ల చదువుకు దూరమయ్యే వేల మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు.
Bandi Sanjay cycle program
ఈ ప్రయత్నాలు భరోసానిస్తాయన్నారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారిణి శోభారాణి, వీణవంక హెచ్ఎం అశోక్ రెడ్డి, బిజెపి జిల్లా నాయకులు పుప్పాల రఘు, గొట్టుముక్కల సంపత్ రావు, బిజెపి నాయకులు మడుగురి సమ్మిరెడ్డి, దాట్ల వీరాస్వామి, దామోదర్, బూత్ అధ్యక్షులు మోటం శ్రీనివాస్, దసారపు అశోక్,సంతోష్, యాదగిరి, రాకేష్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read More: Bandi Sanjay Birthday Celebrations in Vemulawada – కోడెల మొక్కులు, పూజలు, అన్నదాన కార్యక్రమం.
👉 మీరు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా సరే — తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేదా ఇతర ప్రాంతాలు — www.telanganapatrika.in లో రాష్ట్రాలు, రాజకీయాలు, ఉద్యోగాలు, విద్య, మరియు పబ్లిక్ ఇంటరెస్ట్ కు సంబంధించిన విశ్లేషణాత్మక వార్తలు అందుబాటులో ఉంటాయి.