Telanganapatrika (July 26): Both Job Mela 2025 – బోథ్ నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అనిల్ జాదవ్ నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన.

Both Job Mela 2025.
- నిరుద్యోగ సమస్యలతో బాధ పడుతున్న మన బోథ్ నియోజకవర్గ యువతి యువకులకు ఆశాజ్యోతి
- మన అనిల్ జాదవ్ జాబ్ మేళా
స్వాతంత్ర భారత దేశంలో వెనుబడిన ప్రాంతం బోథ్ నియోజకవర్గ నిరుద్యోగ యువతి యువకుల బాధను చూసి వారికి ఒక ఉపాధి కల్పించాలన్న ఉద్యేశ్యంతో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ శనివారం రోజునా ఇచ్చొడ మండల కేంద్రంలో రాయల్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చింది.
వేల సంఖ్యలో నిరుద్యోగులు వచ్చి ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచిన నిరుద్యోగులకు సంబంధిత కంపనీల ఆఫర్ లేటర్లను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాధవ్ మాట్లాడుతూ జాబ్ మేళాకు మొత్తం రిజిస్ట్రేషన్ లు 6448 మంది చేసుకొని ఇంతటి వర్షంలో సైతం 4532 మంది హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు.
ఈరోజు జరిగిన జాబ్ మేళాలో తక్షణమే మొదటి రౌండ్లోనే సెలెక్ట్ అయిన 312 మంది నిరుద్యోగులకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ నియామక పత్రలను అందజేశారు.

రానున్న రోజుల్లో నియోజకవర్గ యువత అందరికి ఉపాధి కల్పించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
TSPSC – తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ వెబ్‌సైట్ – https://www.tspsc.gov.in/
Read More: Kaushik Reddy Case 2025: సీఎం రేవంత్‌పై వ్యాఖ్యలతో కేసు నమోదు.