Telanganapatrika (July 16) : TTD October Darshan 2025 Released – Book Now ,”తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అక్టోబర్ నెలలో శ్రీవారి దర్శనానికి సంబంధించిన ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శన టికెట్లు, గదుల కోటాను దశలవారీగా విడుదల చేయనుంది”. తిరుమల శ్రీనివాసుడి దివ్య దర్శనానికి ప్లాన్ చేస్తున్న భక్తులు ఇప్పుడు తమ కోటా వివరాలను ముందుగానే తెలుసుకుని బుకింగ్ చేసుకోవచ్చు.

అక్టోబర్ ఆర్జిత సేవల కోటా విడుదల తేదీలు
ఆర్జిత సేవ టికెట్లు 👉 జూలై 19 ఉదయం 10:00 గంటలకు
ఎలక్ట్రానిక్ డిప్ నమోదు 👉 జూలై 21 ఉదయం 10:00 గంటలకు ప్రారంభం
డిప్ విజేతలకు చెల్లింపు గడువు 👉 జూలై 23 మధ్యాహ్నం 12:00 లోపు
ఇతర ముఖ్యమైన తేదీలు & కోటాలు
ఆర్జిత బ్రహ్మోత్సవం, పుష్పయాగం, ఉంజల్ సేవ టికెట్లు 👉 జూలై 22 ఉదయం 10:00
వర్చువల్ సేవలు & దర్శన స్లాట్ కోటా సమాచారం 👉 జూలై 22 మధ్యాహ్నం 3:00 గంటల నుండి వెబ్‌సైట్‌లో
అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల 👉 జూలై 23 ఉదయం 10:00 గంటలకు
Srivani Trust టికెట్లు విడుదల 👉 జూలై 23 ఉదయం 11:00 గంటలకు
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టోకెన్లు 👉 జూలై 23 మధ్యాహ్నం 3:00
ప్రత్యేక దర్శన కోటా విడుదల 👉 జూలై 24 ఉదయం 10:00
తిరుమల, తిరుపతి గదుల కోటా 👉 జూలై 24 మధ్యాహ్నం 3:00 గంటలకు
TTD October Darshan 2025 భక్తులకు సూచనలు
భక్తులు తితిదే అధికారిక వెబ్‌సైట్ (https://tirupatibalaji.ap.gov.in) లోకి వెళ్లి ఈ తేదీల్లో తమ సేవల కోసం ముందుగానే నమోదు చేసుకోవాలి. లక్కీ డిప్ ద్వారా ఎంపికైన వారు టైమ్ లో పేమెంట్ చేయకపోతే టికెట్ ఖారారవ్వదు