Telanganapatrika (July 09): రసమయి షాకింగ్ కామెంట్, తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనం సృష్టించారు BRS మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. “ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇది చివరి పాలన అవుతుంది. నా జీవితంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యం. ఒకవేళ వస్తే నా తల తీసి గాంధీ భవన్ దగ్గర వేలాడదీయండి,” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

రసమయి షాకింగ్ కామెంట్ రాజకీయాలలో సంచలనం..
రసమయి మీడియాతో మాట్లాడుతూ, “పత్రికా ప్రతినిధుల సమక్షంలోనే నేను ఈ మాట చెబుతున్నాను. అవసరమైతే మరణ వాంగ్మూలం రాసేందుకు సిద్ధం. కాంగ్రెస్ నాయకులను టీవీల్లో చూడగానే ప్రజలు చానెల్స్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. వీరి పాలనతో ప్రజలు విసిగిపోయారు,” అంటూ మండిపడ్డారు.
ఈ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ఆ పార్టీకి అవకాశం లేదన్న రసమయి ధీమా రాజకీయ విశ్లేషకుల్లో కలకలం రేపుతోంది.
Read More: Read Today’s E-paper News in Telugu