Telanganapatrika (July 01): Ashadam Tribal Rituals. ఆషాఢమాసం ప్రారంభమైన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలోని అనంతపూర్ గ్రామంలో ఆదివాసీ సమాజం సంప్రదాయ పూజలు ఘనంగా నిర్వహించింది. వర్షాకాలం ప్రారంభానికి సూచికగా భావించే అకాడి పూజలతో గ్రామ ప్రజలు వనదేవతలకు నమస్కరించారు.

Ashadam Tribal Rituals వనదేవతలకు పూజలు, సంప్రదాయ నైవేద్యాలు
ఆదివాసీలు గ్రామ పొలిమేరలవైపు వెళ్లి వనదేవతలకు పూజలు చేశారు. ఇంటి పెద్దలు సంప్రదాయ వంటలు సిద్ధం చేసి స్వయంగా నైవేద్యంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రజలు పంటల సమృద్ధి కోరుతూ మొక్కులు
పంటలు సకాలంలో వొచ్చేలా, పశుపక్ష్యాదులు ఆరోగ్యంగా ఉండాలని గ్రామ పెద్దలు మొక్కినట్లు తెలిపారు. ఇది కేవలం పూజ మాత్రమే కాదు, ప్రకృతితో మానవ సహజ అనుసంధానాన్ని చూపే శ్రద్ధా కార్యక్రమం అని వృద్ధులు వివరించారు.
Read More: Read Today’s E-paper News in Telugu