Telanganapatrika (June 29): IPS Kajal Singh. తెలంగాణలో నకిలీ ఆధార్ కార్డులు, నివాస ధ్రువీకరణ పత్రాల ద్వారా కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ ఉద్యోగాల్లో ప్రవేశించిన ముఠా గుట్టు రట్టయింది. ఉట్నూర్ ఎఎస్పీ కాజల్ సింగ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ ముఠా సభ్యులపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభమైంది.

IPS Kajal Singh వెల్లడించిన ప్రకారం కేసు వివరాలు
ఇచ్చోడ పోలీస్ స్టేషన్ క్రైం నం: 131/2025
Sections: 318(4), 335, 338, 340(2), 308(2) & 238 BNS
ఆసామీలు (రిమాండ్):
- A4) షేక్ కలీం (34), ఇస్లాంపూర్, ఇచ్చోడ మండలం
- A5) షేక్ ఫరీద్ (59), ఇస్లాంపూర్, ఇచ్చోడ మండలం
- A6) జాదవ్ గజానంద్ (35), ఇస్లాంపూర్, ఇచ్చోడ మండలం
- నకిలీ పత్రాలతో 9 మంది ఉద్యోగాల్ని సంపాదించారు
ఉత్తర ప్రదేశ్‌కి చెందిన 9 మంది వ్యక్తులు ఇచ్చోడ ప్రాంతానికి చెందినవారిగా చూపిస్తూ నకిలీ ఆధార్ కార్డులు, రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు సృష్టించుకున్నారు. వీరిలో ఒకరైన సహని సూరజ్, సిఐఎస్ఎఫ్‌లో ఉద్యోగం పొందిన నేపథ్యంలో, ఇంటి చిరునామా వెరిఫికేషన్ సందర్భంగా అసత్యంగా ఉండటంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఒక్కొక్కరికి లక్ష రూపాయల డీల్
నకిలీ పత్రాల కోసం ఒక్కొక్క అభ్యర్థి రూ. 1 లక్ష చొప్పున చెల్లించగా, ఇందులో షేక్ ఫరీద్, షేక్ కలీం లకు మొత్తం రూ. 3 లక్షలు లభించాయి. మిగతా డబ్బు ఉత్తర ప్రదేశ్‌లోని హుర్లిక్ ప్రాంతానికి పంపినట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఫోర్జరీ, ఫేక్ డాక్యుమెంట్స్ – మీ సేవను మిస్యూస్
పట్టణ సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేసి, మీ సేవ ద్వారా నకిలీ రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు పొందారు. దీపక్ తివారి మొదటగా అలా ఉద్యోగం పొందగా, మిగతా 8 మంది కూడా అదే విధంగా పనిచేశారు.
ముఠా సభ్యులపై చర్యలు కొనసాగుతున్నాయి
ఇతర అభ్యర్థుల వివరాలను కూడా పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. షేక్ ఫరీద్, షేక్ ఖలీం నకిలీ పత్రాలు ఇవ్వడమే కాకుండా, బెదిరింపులకు పాల్పడ్డ జాదవ్ గజానంద్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి 28 జూన్ 2025న రిమాండ్‌కు తరలించారు.
IPS Kajal Singh కాజల్ సింగ్ మాటల్లో…
“ఈ ముఠా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థను మోసం చేయటంతో పాటు తెలంగాణ కోటాలో ఇతర రాష్ట్రాల వారు ప్రవేశించడానికి మార్గం సృష్టించారు. మిగిలిన నిందితుల వివరాలపై విచారణ కొనసాగుతుంది,” అని ఉట్నూర్ ఎఎస్పీ కాజల్ సింగ్, ఐపీఎస్ తెలిపారు.
ఇతర ముఖ్యులు:
ఈ పాత్రికా సమావేశంలో ఇచ్చోడ సీఐ బండారి రాజు, ఎస్ఐ వి. విష్ణువర్ధన్ పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu