Deshrajpalli ceiling land issue – రెవెన్యూ శాఖ హెచ్చరిక బోర్డు ఏర్పాటు..!

TELANGANAPATRIKA (June 26): Deshrajpalli ceiling land issue. 71 గుంటల సిలింగ్ భూమిపై గ్రామస్థుల ఫిర్యాదు . దేశారాజుపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 407/2 లోని 71 గుంటల సిలింగ్ భూమిని కొందరు భూ ఆక్రమణదారులు తమ పేర్లపై రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారని గ్రామస్థులు భూ భారతి రెవెన్యూ సదస్సులో ఫిర్యాదు చేశారు.

Advertisement

Deshrajpalli ceiling land issue రెవెన్యూ అధికారులు రంగంలోకి..,

రామడుగు రెవెన్యూ ఇన్స్పెక్టర్ కమలేష్, సర్వేయర్ కరుణాకర్ గురువారం సైట్ పరిశీలనకు వచ్చి, “ఈ భూమిలో ఎటువంటి కొనుగోలు–అమ్మకాలు జరగరాదు” అనే హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.

Advertisement

గత రిజిస్ట్రేషన్లపై ప్రజల ఆగ్రహం

Advertisement

ఇప్పటికే 50కి పైగా రిజిస్ట్రేషన్లు జరిగినట్టు సమాచారం. ప్రజలు ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని, భవిష్యత్తులో బోర్డు మాయం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రజల డిమాండ్ – రిజిస్ట్రేషన్ శాఖపై దృష్టి పెట్టాలి

సిలింగ్ నోటీసులు లేకుండా భూములు రిజిస్టర్ అవడమే అసలు సమస్యగా ప్రజలు గుర్తిస్తున్నారు. ఇది ప్రభుత్వ ఆదాయానికి నష్టంగా మారుతుందని వాదిస్తున్నారు.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *