TELANGANAPATRIKA(JUNE 12) : Adilabad Drug Bust 2025. ఆదిలాబాద్: జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాలపై పోలీసులు గట్టి పట్టు సాధించేందుకు చర్యలు ముమ్మరం చేశారు. అనుమతులేని మెడికల్ డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ మెడికల్ షాపు వర్కర్‌ను అరెస్ట్ చేశారు. ఈ విషయం గురువారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

Adilabad Drug Bust 2025 డాక్టర్ ధృవీకరణ లేకుండా డ్రగ్స్ విక్రయం..
తేజా మెడికల్ షాప్‌లో వర్కర్‌గా పనిచేస్తున్న దహికాంబ్లే వికాస్ (24) అనే యువకుడు టెర్మిన్ డ్రగ్‌లను అధిక ధరకు ప్రజలకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఎస్పీ మాట్లాడుతూ – ‘‘డాక్టర్ యొక్క ధృవీకరణ లేకుండా మెడికల్ డ్రగ్స్ విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని హెచ్చరించారు.
వాహన తనిఖీలో పట్టుబడిన నిందితుడు
బుధవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద వాహన తనిఖీల సమయంలో టీఎస్-01-ఈఎల్-8866 నంబరు గల హోండా డియోపై ప్రయాణిస్తున్న వికాస్ అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతని వద్ద మూడు చిన్న టెర్మిన్ డ్రగ్ బాటిళ్లు పట్టుబడ్డాయి.
డ్రగ్ మాఫియాలపై పటిష్ట చర్యలు
ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని విచారించారు. అతడు డ్రగ్‌లను రూ.369కి కొనుగోలు చేసి, వాటిని రూ.1500 చొప్పున అమ్మే ప్రయత్నం చేస్తున్నట్లు అంగీకరించాడు. అతని స్కూటీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హెచ్చరికలు & ఆరోగ్య ముప్పు
డిఎం అండ్ హెచ్ ఓ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ – ‘‘యువత గేమింగ్‌కి, మత్తులో ఉండేందుకు ఇటువంటి డ్రగ్స్ వినియోగిస్తోంది. ఇది శరీరానికి హానికరం, చట్టప్రకారం నేరం’’ అని తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, వన్ టౌన్ సీఐ బి.సునీల్ కుమార్, తదితర అధికారులు పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu