TELANGANAPATRIKA (June 12) : Jubilee Hills By-Election 2025. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మ*రణంతో హైదరాబాద్‌లో మరో ఉప ఎన్నిక తప్పనిసరి అయ్యింది. ఈ పరిణామం తో నగర రాజకీయ వాతావరణం మళ్ళీ వేడెక్కింది. త్వరలోనే Jubilee Hills by-election 2025 నిర్వహించనున్నారు.


Jubilee Hills By-Election 2025 రాజకీయ సమీకరణాలు మారనున్నాయా?
ఎన్నికలు ఆరు నెలలు లోపు జరగాల్సిన నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీకిది కీలక సీటుగా మారింది. గతంలో కంటోన్మెంట్ సీటును చేజిక్కించుకున్న కాంగ్రెస్, ఇప్పుడు జూబ్లీహిల్స్ పై కన్నేసింది. ఇది హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్‌కు మరొక బలమైన ప్రాతినిధ్యం తీసుకొచ్చే అవకాశం.
కాంగ్రెస్ వ్యూహాలు – మజ్లిస్ సహకారం?
2023 ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు. కానీ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో విజయాన్ని దక్కించుకోవడం పార్టీకి ఉత్సాహం నిచ్చింది. ఇప్పుడు మజ్లిస్ పార్టీతో సహకారం పెంపొందించుకుంటూ జూబ్లీహిల్స్‌ను గెలుచుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది.
బీఆర్ఎస్ ఎత్తుగడ ఏమిటి?
సిట్టింగ్ పార్టీగా బీఆర్ఎస్ ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. అయితే ఇటీవల పార్టీకి ఎదురవుతున్న కష్టాలు, నాయకత్వ మార్పులు కాంగ్రెస్‌కు అవకాశాన్ని ఇచ్చేలా ఉన్నాయి.
Read More: Read Today’s E-paper News in Telugu