TELANGANA PATRIKA(JUN 6) , Vemulawada Temple Dargah , దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆలయం ఆవరణలో ఉన్న దర్గాను బయటకు తీస్తానంటూ ఇటీవల జరిగిన సంఘటన ఆలయ పరిసరాల్లో ఉద్రిక్తతను పెంచింది.

భక్తుని పేరిట లేఖ – సోషల్ మీడియాలో వైరల్
రాష్ట్ర ప్రభుత్వం ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో, గర్భగుడి అభివృద్ధిపై భక్తుల అభిప్రాయాలు చర్చకు దారితీశాయి. పీసీసీ ప్రచార కమిటీ కార్యవర్గ సభ్యుడు, న్యాయవాది బూర రవితేజ గౌడ్ ఒక సామాన్య భక్తుడి పేరుతో ప్రభుత్వానికి లేఖ రాశారు. అందులో “హిందూ సాంప్రదాయాల ప్రకారం దేవాలయాల్లో ఇతర మతాల సమాకులు ఉండటం చరిత్రలో కనిపించదు” అని పేర్కొన్నారు.
Vemulawada Temple Dargah పై స్పష్టత కోరుతూ..
దర్గాను ఆలయ ప్రాంగణం వెలుపల నిర్మించాలని, సమస్యకు శాంతియుత పరిష్కారాన్ని కోరుతూ రవితేజ గౌడ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read More: Read Today’s E-paper News in Telugu