
TELANGANA PATRIKA(JUN 1) , కొత్త భూభారతి చట్టం ప్రకారం జూన్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తుర్కపల్లి మండలంలోని ప్రతి రెవెన్యూ గ్రామంలో రెవిన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ దేశ్య నాయక్ తెలిపారు. ఈ సమావేశాల ద్వారా గత కొన్నేళ్లుగా ఎదురవుతున్న భూ సమస్యలను పరిష్కరించుకోవడానికి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
భూభారతి చట్టం రెవిన్యూ సదస్సులు గ్రామాల వారీగా షెడ్యూల్:
- జూన్ 3 – నాగాయపల్లి, గోపాలపురం
- జూన్ 4 – కొండాపురం, శ్రీనివాసపురం
- జూన్ 5 – వాసాలమర్రి, తిరుమలాపురం
- జూన్ 9 – మాదాపురం, చిన్న లక్ష్మాపురం
- జూన్ 10 – తుర్కపల్లి, మల్కాపూర్
- జూన్ 11 – కోమటికుంట, వెంకటాపూర్, దత్తాయిపల్లి
- జూన్ 12 – ఇబ్రహీంపురం, కోనాపురం
- జూన్ 13 – వేల్పుపల్లి, ధర్మారం
- జూన్ 16 – రూస్తాపురం
- జూన్ 17 – గంధ మల్ల
- జూన్ 18 – వీరారెడ్డిపల్లి
- జూన్ 19 – ములకలపల్లి
- జూన్ 20 – పల్లె పహాడ్
రైతులకు సూచనలు:
రైతులు తమ భూములపై ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఆయా గ్రామాల్లో జరిగే రెవిన్యూ సదస్సుల్లో హాజరై, తగిన ఆధారాలతోపాటు దరఖాస్తులు సమర్పించాలని తహసీల్దార్ సూచించారు.