
Rajiv Yuva Vikasam – తొలి విడతలో రూ.లక్ష ప్రొసీడింగ్స్
TELANGANA PATRIKA(MAY31) , తెలంగాణలో రాజీవ్ యువ వికాసం పథకం వేగంగా అమలవుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షలో భాగంగా, జూన్ 10 నుంచి 15 వరకు లబ్ధిదారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే జూన్ 15 తర్వాత యూనిట్ల గ్రౌండింగ్ చేపడతామని వెల్లడించారు. అక్టోబరు 2 నాటికి దశలవారీగా 5 లక్షల మందికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వ ధ్యేయం ఉంది.
Rajiv Yuva Vikasam రూ.లక్ష లోపు యూనిట్లకు ప్రాధాన్యత
పథకం తొలి విడతలో రూ.లక్ష లోపు యూనిట్లకు ప్రొసీడింగ్స్ మంజూరు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఈ పథకం కింద వచ్చే జూన్ 2న రూ.1000 కోట్ల నిధులు విడుదల కానున్నాయి. భట్టి విక్రమార్క వ్యాఖ్యానంలో – ఇది మొదటిపల్లె మాత్రమే, రాబోయే రోజుల్లో యువతకు స్వయం ఉపాధి కల్పించే పథకాలతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు.
Read More: Read Today’s E-paper News in Telugu