
TELANGANA PATRIKA(MAY30) , యాదాద్రి భువనగిరి జిల్లా , రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియను యాదాద్రి భువనగిరి జిల్లా లో ఏవో పద్మజ బృందం శుక్రవారం అర్ధరాత్రివరకు నిర్విరామంగా నిర్వహించారు. రాజపేట మండలంలో మూడు గ్రామాలలోని రైతు వేదిక కేంద్రాలైన రాజాపేట, పాముకుంట,బొందుగుల గ్రామాలలో కార్యక్రమం సాగింది.దాదాపు రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కేంద్రాల వద్దకు ఆయా గ్రామాల పరిధిలోని రైతులు ఉదయం నుంచి బారులు తీరారు.ఏవో పద్మజ పర్యవేక్షణలో స్వయంగా వుండి కార్యక్రమం పూర్తి అయ్యేలా తగు చర్యలు ఎప్పటికప్పుడు తీసుకున్నారు.శుక్రవారం రాత్రి వరకు రాజపేటలోని రైతు కేంద్రంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో ఏఈఓ లతోపాటు, ప్రత్యేక బృందంతో నమోదు ప్రక్రియను వేగవంతం చేశారు. దీంతో ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియ పుంజుకోవడంతో రైతులతో వస్తున్న విమర్శలు తగ్గాయి. మండలంలో దాదాపు 17వేల మంది రైతులు ఉండగా, వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న వారు కూడా ఆధార్ కార్డు జిరాక్స్ తో పాటు సమాచారం వచ్చే ఫోన్ ను కూడా వెంట తీసుకొని రైతు రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేయించుకున్నారు.రైతు రిజిస్ట్రేషన్ వల్ల కలిగే ప్రయోజనాలను, రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే జరిగే ఇబ్బందులను ఏవో పద్మజ రైతులకు వివరించారు.
Read More: Read Today’s E-paper News in Telugu


Comments are closed.