Advertisement

MLA Kavvampally: ఇళ్ల కల నెరవేరే రోజు దగ్గరలో పంపిణీకి రంగం సిద్ధం..! 2025

TELANGANA PATRIKA (MAY 17) ,MLA Kavvampally: మానకొండూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద తొలి విడుతగా మండలానికో గ్రామాన్ని పైలెట్ గ్రామంగా ఎంపిక చేసి లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వగా, ఆయా గ్రామాల్లో ఇళ్ల నిర్మాణ పనులు ప్రగతిలో ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. పైలట్ గ్రామాలుగా మానకొండూర్ మండలం లో ముంజంపల్లి, శంకరపట్నం మండలంలో ఇప్పలపల్లి, తిమ్మాపూర్ మండలంలో కొత్తపల్లి, గన్నేరువరం మండలంలో గుండ్లపల్లి, బెజ్జంకి మండలంలో వీరాపూర్,ఇల్లంతకుంట మండలంలో సిరికొండ గ్రామాలు ఎంపికైనట్టు ఆయన వివరించారు. కాగా, పైలట్ గ్రామం మినహా మిగితా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకు చర్యలు వేగవంతం చేశామని, త్వరలోనే తేదీ ఖరారు చేసి ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు.

Advertisement

Also Read : పెద్దపల్లి ఎమ్మెల్యే రైతులకు ఊరట – 50% సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

Comments are closed.